News February 19, 2025

ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం

image

ఢిల్లీకి నాలుగో సారి మహిళ సీఎంగా ఉండనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశీ (ఆప్) సీఎంలుగా పని చేశారు. తాజాగా రేఖా గుప్తా (బీజేపీ) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం దేశంలోని 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, అందరూ పురుష సీఎంలే ఉన్నారు. వ్యూహంలో భాగంగానే ఢిల్లీ పీఠం మహిళకు అప్పగించినట్లు తెలుస్తోంది.

Similar News

News November 10, 2025

క్రీడాకారులకు గ్రూప్-1 ఉద్యోగాలపై భిన్నాభిప్రాయాలు

image

మహిళా క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1, స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగాలిచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గౌరవించాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కాకుండా స్పోర్ట్స్ కోటాలో వారికి ఉద్యోగాలివ్వడంపై పలువురు ఫైరవుతున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగానే ప్రభుత్వాల నిర్ణయాలని కొందరు సమర్థిస్తున్నారు.

News November 10, 2025

లైంగిక వేధింపులు ఎదురైతే..

image

బహిరంగ ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే వెంటనే సదరు వ్యక్తిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చు. అంటే ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఐపీసీ 354(ఎ), 354(డి), BNS సెక్షన్ 79 కింద కేసు నమోదు చేయవచ్చు. సెక్షన్ 354 కింద మహిళపై దాడికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సెక్షన్ 294 ప్రకారం మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలి.

News November 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 62 సమాధానాలు

image

ప్రశ్న: శిఖండి ఎవరు? ఆమె భీష్ముడి చావునెందుకు కోరింది?
జవాబు: శిఖండి పూర్వజన్మలో కాశీ రాజకుమారి అంబ. ఆమె ఒకర్ని ప్రేమించి, వివాహం చేసుకోవాలి అనుకోగా.. భీష్ముడు బలవంతంగా తనను తీసుకెళ్లి వేరొకరికిచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు ప్రతిజ్ఞ పూనిన అంబ మరుజన్మలో శిఖండిగా పుట్టి, యుద్ధంలో పాల్గొని, భీష్ముని చావుకు కారణమైంది.
☞ సరైన సమాధానం చెప్పినవారు: కృష్ణ, నల్గొండ.
<<-se>>#Ithihasaluquiz<<>>