News April 7, 2025
డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం: ఆర్.నారాయణమూర్తి

AP: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం భారీ కుట్రకు తెరతీసిందని ఆయన ఆరోపించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డీలిమిటేషన్ ఉత్తరాది రాష్ట్రాలకు మేలు, దక్షిణాది రాష్ట్రాలకు చెడు చేసేలా ఉంది. దురుద్దేశంతోనే కేంద్రం పునర్విభజనకు పూనుకుంటోంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News April 8, 2025
పడుకునే ముందు వీటిని తింటున్నారా?

రాత్రి పడుకునే ముందు కొన్ని ఆహార పదార్థాలు తింటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. నిద్ర, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వైట్ బ్రెడ్తో చేసే శాండ్ విచ్, పిజ్జా తింటే కడుపులో మంట పెరిగి నిద్రకు ఆటంకం కలుగుతుంది. బిర్యానీ, స్వీట్లు, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ద్రాక్ష, ఆరెంజ్, నిమ్మకాయలు తినకూడదు. కెఫిన్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలు. రాత్రి ఆహారం 7 గంటలలోపు తినడం ఉత్తమం.
News April 8, 2025
చైనాను హెచ్చరించిన ట్రంప్

చైనాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమపై విధించిన 34శాతం టారిఫ్ను వెనక్కి తీసుకోకపోతే డ్రాగన్ దేశంపై మరో 50శాతం సుంకం విధిస్తామని అల్టిమేటం జారీ చేశారు. రేపటికల్లా పన్నుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకపోతే ఏప్రిల్ 9నుంచి చైనా దిగుమతులపై అదనపు పన్ను ఉంటుందన్నారు. ట్రంప్ డ్రాగన్ వస్తువులపై 34శాతం టారిఫ్లు వేయగా, బీజింగ్ సైతం అంతే మెుత్తంలో US దిగుమతులపై సుంకాలు విధించింది.
News April 8, 2025
ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్

TG: డిగ్రీలో ఫెయిలైన విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త చెప్పింది. అన్ని కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం వన్ టైమ్ ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. www.jntuh.ac.in సైట్లో దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.