News October 22, 2024

డెలివరీ ఏజెంట్ బూతులు.. క్షమాపణ చెప్పిన జొమాటో

image

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆఫీస్ సిబ్బంది 10 నిమిషాలు ఆలస్యంగా డెలివరీ తీసుకున్నందుకు ఏజెంట్ దుర్భాషలాడాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘మీ డెలివరీ బాయ్స్ ప్రవర్తనను మెరుగుపర్చడంపై ఎందుకు ఫోకస్ చేయరు? ఇలా బూతులు తిట్టే హక్కు ఎవరికీ లేదు’ అని పేర్కొన్నారు. దీంతో జొమాటో కేర్ క్షమాపణలు కోరింది. ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

Similar News

News November 26, 2025

ఉర్విల్ ఊచకోత.. 10 సిక్సులు, 12 ఫోర్లతో..

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ కెప్టెన్ ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించారు. 31 బంతుల్లోనే శతకం బాదారు. మొత్తంగా 37 బంతుల్లో 10 సిక్సులు, 12 ఫోర్లతో 119* రన్స్ చేశారు. తొలుత సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 182/9 స్కోర్ చేయగా, ఉర్విల్ ఊచకోతతో గుజరాత్ 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా T20లలో ఫాస్టెస్ట్ సెంచరీ ఉర్విల్ పేరుమీదనే ఉంది. 2024లో త్రిపురపై 28 బాల్స్‌లోనే శతకం చేశారు.

News November 26, 2025

చెట్టు కోసం 363 మంది ప్రాణాలు కోల్పోయారు!

image

రాజస్థాన్ రాష్ట్ర వృక్షమైన హేజ్రీ చెట్టు ఉనికి వెనుక వందల మంది ప్రాణత్యాగం ఉందనే విషయం తెలుసా? 1730లో జోధ్‌పూర్ రాజు అభయ్ సింగ్ ప్యాలెస్ నిర్మాణానికి కలప సేకరించాలని సైనికులను పంపారు. ఇది తెలుసుకున్న బిష్ణోయ్ కమ్యూనిటీ సైనికులను అడ్డుకుంది. చెట్టును కౌగిలించుకుని నరకొద్దని కోరింది. సైనికులు వినకుండా 363 మందినీ నరికేశారు. ఇది తెలుసుకున్న రాజు చలించి చెట్లను నరకొద్దని ఆదేశించడంతో ఆ చెట్టు బతికింది.

News November 26, 2025

పంటలలో తెగుళ్ల ముప్పు తగ్గాలంటే..

image

వేసవిలో భూమి/నేలను లోతుగా దున్ని తెగుళ్లను కలిగించే శిలీంద్రాలను నాశనం చేయవచ్చు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకొనే రకాల విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనశుద్ధి తప్పక చేసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తుకునే/నాటుకునే సమయాన్ని మార్చుకోవడం వల్ల తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.