News July 31, 2024

కేరళలో ప్రళయం.. 163కి చేరిన మరణాలు

image

కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులో మరణాల సంఖ్య 163కి చేరింది. ఇంకా 85 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. భారత సైన్యంతో పాటు NDRF బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి జార్జి కురియన్ తెలిపారు. 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. కాగా ఇప్పటివరకు 89 మృతుల వివరాలను గుర్తించారు.

Similar News

News April 1, 2026

మేం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు: జగన్

image

AP: అమరావతికే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ తాము వ్యతిరేకం కాదని ప్రెస్‌మీట్‌లో YCP చీఫ్ జగన్ స్పష్టం చేశారు. ‘అమరావతి పేరుపై అప్పులు తెచ్చి స్కామ్‌లు చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో రోడ్లు, నీళ్లు, డ్రైనేజీకి రూ.2లక్షల కోట్లు కావాలి. అంత ఖర్చు చేసే స్థోమత మనకు ఉందా? ఏడేళ్లలో CBN ఖర్చు పెట్టింది రూ.8వేల కోట్లే. వీటికి అసెంబ్లీలో CBN సమాధానం చెప్పాడా?’ అని ప్రశ్నించారు.

News April 1, 2026

టీ తోటలో మోదీ.. కార్మికులతో ముచ్చట్లు

image

అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిబ్రూగఢ్‌లోని టీ తోటలను సందర్శించారు. అక్కడ తేయాకు కోస్తున్న మహిళా కార్మికులతో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న మోదీ.. అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంలో వారి శ్రమ అమూల్యమైనదని కొనియాడారు. తోటల్లో మహిళలతో కలిసి సరదాగా కాసేపు తేయాకు కోశారు. ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.

News April 1, 2026

IPL: శ్రేయస్ అయ్యర్‌కు ఫైన్

image

IPL-19 సీజన్‌లో తొలిసారి PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌‌కు BCCI ఫైన్ విధించింది. నిన్న GTతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ ల రూ.12లక్షల ఫైన్ వేసింది. PBKS 19వ ఓవర్ చేరుకునేటప్పటికే అంపైర్ స్లో ఓవర్ వార్నింగ్ ఇవ్వగా ఆపై <<19529168>>అర్ష్‌దీప్<<>> మరింత ఆలస్యం చేశారు.