News March 18, 2025
మంచు లక్ష్మి, కాజల్, రానాపై కేసుకు డిమాండ్!

టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చొరవతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న కూడా 11 మందిపై కేసు నమోదైంది. అయితే, మంచు లక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని విమర్శలొస్తున్నాయి. బెట్టింగ్ యాప్ యాడ్స్‌లో నటించిన రానా, కాజల్, ప్రకాశ్‌రాజ్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News March 18, 2025
24 మంది దళితుల హత్య.. ముగ్గురికి మరణశిక్ష

UPలోని దిహులీ నరమేధం కేసులో మెయిన్‌పురి కోర్టు ముగ్గురికి మరణశిక్ష విధించింది. 1981 నవంబర్ 18న దిహులీ గ్రామంలోని SC కాలనీలోకి చొరబడిన సాయుధ దుండగుల బృందం పురుషులు, మహిళలు, పిల్లలపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 24 మంది మరణించారు. 17 మంది నిందితులపై FIR నమోదవగా, 14 మంది విచారణ సమయంలో చనిపోయారు. మిగిలిన ముగ్గురికి కోర్టు శిక్ష విధించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది.
News March 18, 2025
ఏడుగురు MLCల పదవీకాలం ముగింపు

AP: శాసనమండలిలో ఏడుగురు సభ్యుల ఆరేళ్ల పదవీకాలం ముగిసింది. యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, రఘువర్మ పదవీ కాలం ముగియడంతో మండలి వారికి ఘనంగా వీడ్కోలు పలికింది. అంతకముందు వీరు సీఎంతో జరిగిన ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. అనంతరం మండలిని ఛైర్మన్ మోషేన్ రాజు రేపటికి వాయిదా వేశారు.
News March 18, 2025
విజయ్‌పై అన్నామలై ఫైర్.. సినిమా సెట్స్‌లో ఎంజాయ్ చేస్తున్నాడంటూ..

తమిళ హీరో, TVK అధినేత విజయ్‌పై TN BJP చీఫ్ అన్నామలై మండిపడ్డారు. ‘సినిమాల్లో డ్రింక్, స్మోక్ చేసే నీకు మద్యం కుంభకోణం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇంట్లో నుంచి రాజకీయాలు చేయడం కాదు. గ్రౌండ్ లెవెల్‌కి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. సినిమా సెట్స్‌లో సిగరెట్, మద్యం తాగుతూ హీరోయిన్ల నడుము తాకుతూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నాడు. నేను అతనిలా కాదు. క్షేత్ర స్థాయిలో పోరాడుతున్నా’ అని కామెంట్స్ చేశారు.