News April 13, 2025
ఎకరానికి రూ.20వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్

TG: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20వేల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. వడగళ్ల వానలతో ఉత్తర తెలంగాణలో భారీ నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే వివరాలు సేకరించాలంది. వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.40వేలు ఇవ్వాలని కోరింది. కాగా నష్టపోయిన అన్నదాతలకు ఎకరానికి రూ.10వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
Similar News
News July 5, 2025
WOW.. అంతరిక్షం నుంచి మెరుపు ఎలా ఉందో చూడండి

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన మెరుపు ఫొటో నెటిజన్లను మైమరిపిస్తోంది. దీనిని స్ప్రైట్ అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ మెరుపులా కాకుండా జెల్లీ ఫిష్ ఆకారపు పేలుళ్లు లేదా స్తంభంలా కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘జస్ట్ వావ్. మేము ఈ ఉదయం మెక్సికో & యూఎస్ మీదుగా వెళ్లినప్పుడు, నేను ఈ స్ప్రైట్ను బంధించా’ అని వ్యోమగామి నికోల్ SMలో ఈ చిత్రాన్ని పంచుకోగా వైరలవుతోంది.
News July 5, 2025
ఇన్స్టాలో అమ్మాయి, అబ్బాయి ముద్దు వీడియో వైరల్.. తర్వాత..

TG: సోషల్ మీడియాను మిస్ యూస్ చేస్తే అనర్థాలకు దారి తీస్తుందనడానికి ఈ ఘటనో ఉదాహరణ. వరంగల్లోని కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసుకొని దాన్ని ఇన్స్టాలో అప్లోడ్ చేశారు. అది కాస్తా క్షణాల్లో వైరలై ఇరు కుటుంబాల వాళ్లు చూశారు. దీంతో 2 వర్గాలు రోడ్డుపైకి వచ్చి పరస్పరం దాడి చేసుకున్నాయి. ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.
News July 5, 2025
రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబీస్ టీకాలు

AP: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. పశువైద్యశాలలు, ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, పాలీ క్లినిక్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఇవి అందించనున్నారు. ఇందుకోసం 5.37 లక్షల టీకాలను సిద్ధం చేశారు. జంతువుల నుంచి మనుషులకు లేదా మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు.