News March 6, 2025
బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలి: జగన్

కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయాలని YCP MPలకు జగన్ సూచించారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై పార్లమెంటులో చర్చ జరిగే అవకాశమున్న నేపథ్యంలో వారికి సూచనలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో EVMలతో నిర్వహించిన దేశాలు కూడా తర్వాత బ్యాలెట్ విధానానికి మళ్లాయని గుర్తు చేశారు.
Similar News
News March 7, 2025
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ: మంత్రి పొంగులేటి

TG: ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా 90 పోస్టులు మంజూరు చేశామని చెప్పారు. 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో HMDAను విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. HMDA పరిధిలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు ఏర్పాటు చేస్తామన్నారు.
News March 7, 2025
త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్: మంత్రి

AP: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. BC, EWS అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, టెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖాధికారులను సంప్రదించాలని మంత్రి వివరించారు.
News March 6, 2025
రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలని హుండీలో చీటీలు

తెలంగాణలోని ప్రముఖ వేములవాడ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలోని దర్గాను తొలగించాలని కొద్ది రోజులుగా పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ‘దర్గా హఠావో.. వేములవాడ బచావో’ అని చీటీలు రాసి హుండీలో వేశారు. ఆలయ సిబ్బంది వీటిని గమనించి తొలగించారు. కాగా, ఈ దర్గాను రెండు ముస్లిం వర్గాలు నిర్వహిస్తున్నాయి.