News November 10, 2024
స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్

TG: 317 G.O. వల్ల స్థానికత కోల్పోయిన తమను వెంటనే సొంత జిల్లాలకు కేటాయించాలని ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరుతున్నారు. మంత్రివర్గ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయాలన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తాము అధికారంలోకి రాగానే 317 G.O. వల్ల స్థానికత కోల్పోయిన వారిని 48 గంటల్లోనే సొంత జిల్లాలకు పంపిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 14, 2025
దూసుకెళ్తున్న నవీన్ యాదవ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఏడో రౌండ్ ముగిసేసరికి ఆయన 19వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో మూడు రౌండ్లు కౌంటింగ్ చేయాల్సి ఉంది.
News November 14, 2025
గొర్రె పిల్లల పెరుగుదల వేగంగా ఉండాలంటే..

గొర్రె పిల్లల పెరుగుదల వాటి జాతి, లభించే పోషకాహారంపై ఆధారపడి ఉంటుంది. పుట్టిన నెల వయసు నుంచే గొర్రె పిల్లలను కూడా తల్లులతో పాటు మేత కోసం బయటకు తీసుకెళ్తారు. ఆ సమయంలో సంపూర్ణ పోషకాహారం అందక గొర్రె పిల్లల్లో రోజువారీ పెరుగుదల 100 గ్రాములకు మించడం లేదు. అదే గొర్రె పిల్లలకు 150 రోజుల వరకు షెడ్లలో ఉంచి సంపూర్ణ ఆహారం అందిస్తే అవి రోజుకు కనీసం 175 గ్రాముల వరకు పెరుగుతాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.
News November 14, 2025
డబుల్ సెంచరీ దిశగా NDA!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం దిశగా NDA దూసుకువెళ్తోంది. ప్రస్తుతం 191 సీట్లలో లీడింగ్‌లో ఉండగా డబుల్ సెంచరీ దిశగా సాగుతోంది. మహాగఠ్‌బంధన్ హాఫ్ సెంచరీ మార్క్ కూడా దాటలేదు. ప్రస్తుతం 48 చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉంది. తేజస్వీ యాదవ్ వంటి కీలక నేతలు కూడా వెనుకబడటం గమనార్హం.


