News April 19, 2024
ఏప్రిల్ 23న సెలవు ఇవ్వాలని డిమాండ్

TG: హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 23న సెలవు ప్రకటించాలని తెలంగాణ విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు డిమాండ్ చేశారు. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి అని గుర్తు చేశారు. ఆరోజు గౌలిగూడ శ్రీరామ మందిర్ నుంచి తాడ్బండ్ హనుమాన్ మందిర్ వరకు భారీ ర్యాలీ చేస్తామని, ఈ నేపథ్యంలో అధికారికంగా సెలవు ప్రకటించాలని కోరారు.
Similar News
News November 9, 2025
కాగజ్నగర్: పేదలకు అందని కంటి వైద్యం

కాగజ్నగర్ ప్రభుత్వాసుపత్రిలో కంటి వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం కంటి పరీక్షల కోసం సుమారు రూ.5 లక్షల విలువైన కంటి పరీక్ష యంత్రం (ఆప్టోమె ట్రిస్ట్) ఏర్పాటు చేసి వైద్యుడిని నియమించింది. 3 నెలల నుంచి యంత్రం మరమ్మతులో ఉంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కంటివైద్యం అందని ద్రాక్షగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<


