News November 23, 2024
గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్
TG: రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనుండగా, RRB జూ.ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అదే నెల 16, 17, 18 తేదీల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. 16న ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో, రెండింటికీ దరఖాస్తు చేసుకున్న వారు ఏదో ఒక దానిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. RRB దేశవ్యాప్తంగా జరిగే పరీక్ష కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News November 23, 2024
అమెరికా కోర్టులో మరో భారతీయుడిపై కేసు
USలోని ఓరెగావ్ కోర్టులో ఓ భారతీయుడిపై నేరాభియోగాలు నమోదయ్యాయి. సంజయ్ కౌశిక్ ఓ వైమానిక పరికరాన్ని రష్యాకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నించినట్టు DOJ తెలిపింది. కొన్ని దేశాలకు US నుంచి ఎగుమతి చేయాలంటే లైసెన్స్ అవసరం. భారత్లోని తన కంపెనీకి పంపిస్తున్నాని కౌశిక్ లైసెన్స్ తీసుకొని మోసగించాడని DOJ పేర్కొంది. దేశం దాటకముందే దానిని స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. OCT17నే ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం.
News November 23, 2024
ఝార్ఖండ్: 23 సీట్లకు పెరిగిన బీజేపీ+ ఆధిక్యం
ఝార్ఖండ్ ఓట్ల లెక్కింపులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే దూసుకుపోతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం 23 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 41. మరో 20 సీట్లలో ఆధిపత్యం చెలాయిస్తే విజయానికి చేరువైనట్టే. ఇక ఇండియా కూటమి 7 సీట్లలో ముందంజలో ఉంది. 81కి గాను ప్రస్తుతం 30 సీట్ల ఆధిక్యాలే అందుబాటులో ఉన్నాయి.
News November 23, 2024
తొలి రౌండ్లో ప్రియాంకకు 3వేల ఓట్ల ఆధిక్యం
వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీ దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్లో ఆమె సమీప ప్రత్యర్థి నవ్య హరిదాస్(బీజేపీ)పై 3వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లో ప్రియాంకకు 600 ఓట్ల లీడింగ్ వచ్చింది. మరోవైపు విజయంపై నవ్య ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు.