News April 7, 2025

ఎకరానికి రూ.2 కోట్ల డిమాండ్.. కష్టంగా ఎయిర్‌పోర్టు భూసేకరణ!

image

TG: వరంగల్‌ జిల్లా మూమునూరు ఎయిర్‌పోర్టుకు భూసేకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అక్కడి భూముల రేట్లు అమాంతం పెరిగాయి. ప్రభుత్వం రూ.40 లక్షలు ఇస్తామంటుండగా స్థానిక రైతులు ఎకరానికి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 253 ఎకరాల భూమికోసం ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించింది. కాగా.. ఎయిర్‌పోర్టు రాకతో కొత్త పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి.

Similar News

News April 9, 2025

కాకాణికి హైకోర్టులో షాక్

image

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. కాగా క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు.

News April 9, 2025

ALERT: కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం

image

TG: రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

News April 9, 2025

చాహల్.. నీకోసం మేమున్నాం: RJ మహ్వాష్

image

PBKS ప్లేయర్ చాహల్‌కు మద్దతుగా అతని రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ RJ మహ్వాష్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘కష్టసుఖాల్లో మన వాళ్ల కోసం ఓ బండరాయిలా ఉండి అండగా నిలవాలి. చాహల్ నీకోసం మేమందరం ఉన్నాం’ అంటూ నిన్న మ్యాచ్ అనంతరం ఆయనతో తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు. దానికి చాహల్ స్పందిస్తూ.. ‘మీరే నా వెన్నెముక! నన్ను ఎల్లప్పుడూ ఉన్నతంగా నిలబెట్టినందుకు ధన్యవాదాలు’ అని లవ్ సింబల్‌తో కామెంట్ చేశారు.

error: Content is protected !!