News September 23, 2024
MLA నానాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్

AP: కాకినాడ(R) MLA పంతం <<14168792>>నానాజీ <<>>పట్ల వైద్యులు ఇంకా గుర్రుగానే ఉన్నారు. కాకినాడ RMC వైద్యుడిపై దాడి చేసిన ఆయన్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. MLA, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది. ఇవాళ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేయనుండగా, రేపు ఇతర సంఘాల మద్దతుతో కాకినాడ SPకి ఫిర్యాదు చేయనుంది. ఈ ఘటనపై MLA ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.
Similar News
News December 10, 2025
ఎండినవారికి ఇనుము తిండి

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.
News December 10, 2025
గణపతి స్తోత్రాన్ని ఎప్పుడు పఠించడం ఉత్తమం?

వినాయకుడి స్తోత్రాలు పఠించడానికి బుధవారం ఉత్తమ దినమని పండితులు చెబుతున్నారు. శుభ దినాలప్పుడు కూడా ప్రారంభించవచ్చని, సంకష్టహర చతుర్థి రోజున మొదలుపెట్టడం మరింత మేలని అంటున్నారు. ‘ప్రారంభించిన తర్వాత రోజూ పఠించడం చాలా ముఖ్యం. ఉదయాన్నే స్నానం చేసి, శుచిగా దీపారాధన చేసి, గణేశునికి కొంచెం గరిక, నైవేద్యాన్ని సమర్పించి స్తోత్రాన్ని పఠించాలి. చివరగా హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News December 10, 2025
నేటి నుంచి TET పరీక్షలు

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (TET) నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా 96.25% మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ నెల 21 వరకు రోజుకు 2 సెషన్లలో 9.30AM నుంచి 12PM, 2.30PM నుంచి 5PM వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.


