News October 3, 2024
జానీ మాస్టర్ అవార్డును రద్దు చేయాలని డిమాండ్

మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు ఆయన బెయిల్ కోరారు. అయితే, జానీ మాస్టర్‌కు వచ్చిన అవార్డును రద్దు చేయాలని పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే జానీ మాస్టర్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చేవరకు హోల్డ్‌లో పెట్టాలని మరికొందరు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 19, 2026
నేటి నుంచి ఏయూలో తరగతులు పున:ప్రారంభం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేటి నుంచి తరగతులు పున:ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో దాదాపు నెల రోజులపాటు విద్యార్థులకు సెలవులను ఇచ్చారు. పండుగ సెలవుల అనంతరం ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ఐదు రోజులుగా బోధనేతర సిబ్బందికి సైతం పండగ సెలవులు లభించాయి దీంతో విశ్వవిద్యాలయం బోసిపోయింది. నేటి నుంచి పూర్తిస్థాయిలో వర్సిటీ పనిచేస్తుంది.
News January 19, 2026
CMERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News January 19, 2026
YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.


