News November 12, 2024
స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని డిమాండ్

తెలంగాణలోని గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని UTF డిమాండ్ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుగుణంగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకే ఉండేలా చూడాలని సీఎస్ శాంతికుమారికి విజ్ఞప్తి చేసింది. గతంలో ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. కాగా రాత్రి వరకు స్కూళ్లు ఉండటంతో తాము ఇళ్లకు వెళ్లేందుకు ఆలస్యం అవుతోందని టీచర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Similar News
News November 27, 2025
సారంగాపూర్: ‘వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

సారంగాపూర్ మండలం అర్పపల్లి జెడ్పీహెచ్ఎస్ను అదనపు కలెక్టర్ బీ.ఎస్.లత గురువారం పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనం నాణ్యత, మెనూ, రిజిస్టర్లను తనిఖీ చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. గైర్హాజరైన విద్యార్థిని అక్షిత ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.
News November 27, 2025
వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

‘జెమిని 3’ మోడల్ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
News November 27, 2025
నిర్మాతలను బ్లేమ్ చేయొద్దు: SKN

కంఫర్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రొడ్యూసర్స్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ప్రేక్షకులనుద్దేశించి నిర్మాత SKN పేర్కొన్నారు. ‘మనం కంఫర్ట్, లగ్జరీ కావాలి అనుకున్నప్పుడే ఎక్కువ పే చేయాలి. కేవలం కంఫర్ట్ కోసమే ఎక్స్ట్రా చెల్లిస్తున్నాం. లగ్జరీ థియేటర్లో చూడాలంటే రియల్ఎస్టేట్ వాల్యూ ప్రకారం టికెట్, రిఫ్రెష్మెంట్ రేట్లుంటాయి. వాటితో నిర్మాతకొచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదు’ అని తెలిపారు.


