News March 1, 2025

మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్

image

TG: మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ కులం నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు నివాసంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, BJP, BRSకు చెందిన కాపు నేతలు పాల్గొన్నారు. కులగణనలో కాపుల సంఖ్యను తగ్గించారని, ప్రభుత్వ/నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్నూరు కాపు సభ, మంత్రి పదవి ఇస్తేనే కులగణనపై కృతజ్ఞత సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Similar News

News March 1, 2025

దివ్యాంగులకు ఇక నుంచి UDID కార్డులు

image

TG: సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. దివ్యాంగులకు ఇక నుంచి యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు(UDID) ఇవ్వాలని నిర్ణయించింది. సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ UDID నంబర్ జనరేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కార్డులు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. మీ సేవల్లో స్లాట్ బుక్ చేసుకుని, సదరం క్యాంపుకు వెళ్తే UDID ఇస్తారు.

News March 1, 2025

నేలపై కూర్చుని తింటున్నారా?

image

డైనింగ్ టేబుల్ కాకుండా నేల మీద కూర్చుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘ప్లేట్‌లోని ఆహారాన్ని వంగి తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. కండరాలు, శారీరక నొప్పులు దూరమవుతాయి. భోజనం ఎంత తింటున్నామో జ్ఞప్తిలో ఉంటుంది. తద్వారా బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నేలపై కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది’ అని పేర్కొంటున్నారు.* మీరు ఎలా తింటారు? కామెంట్ చేయండి.

News March 1, 2025

మ్యాచులు రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్: PCB

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈనెల 25, 27న రావల్పిండిలో జరగాల్సిన మ్యాచులు టాస్ పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచుల కోసం టికెట్లు కొన్న ప్రేక్షకులకు పూర్తి డబ్బులను రీఫండ్ చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డ్యామేజ్ అవని ఒరిజినల్ టికెట్లతో వచ్చి టికెట్ సెంటర్ల వద్ద డబ్బులు తీసుకోవాలని సూచించింది. బాక్సెస్, గ్యాలరీ టికెట్లు తీసుకున్న వారికి రీఫండ్ వర్తించదని పేర్కొంది.

error: Content is protected !!