News November 7, 2024
DSCలో ‘సమగ్ర శిక్ష’ సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్

AP: సమగ్రశిక్ష పథకం కింద పనిచేస్తున్న CRP, MIS కోఆర్డినేటర్లు, CRTలకు మెగా డీఎస్సీలో వెయిటేజీ మార్కులు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. వీరు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ పేర్కొంది. విధుల్లో బిజీగా ఉన్నందున మిగిలిన అభ్యర్థుల్లా వీరికి సన్నద్ధతకు అవకాశం ఉండదని తెలిపింది. 2019 డీఎస్సీలోనూ వెయిటేజ్ మార్కులు ఇచ్చారని గుర్తు చేసింది.
Similar News
News October 27, 2025
అయ్యప్ప దీక్షలో ఉంటూ లంచం

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ ఆఫీసులో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు. 2 ఎకరాల 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.40వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.20వేలలో రూ.5వేలు తగ్గించి మిగతా రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. అతడు అయ్యప్ప దీక్షలో ఉండి లంచం తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
News October 27, 2025
WWC: ప్రతీకా స్థానంలో షెఫాలీ వర్మ!

మహిళా వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో గాయపడిన భారత ఓపెనర్ ప్రతీకా రావల్ స్థానంలో షెఫాలీవర్మ జట్టులోకి రానున్నారు. ఆస్ట్రేలియాతో ఈ నెల 30న జరిగే సెమీఫైనల్లో ఆమె జట్టులో చేరుతారని ESPN పేర్కొంది. కాగా గాయం కారణంగా ప్రతీకా టోర్నీలో మిగతా మ్యాచులకు దూరమయ్యారని వెల్లడించింది. దూకుడుగా ఆడే ప్లేయర్‌గా పేరున్న షెఫాలీ రాకతో జట్టుకు బలం చేకూరనుంది. ఈ మార్పుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News October 27, 2025
92 ఏళ్ల వయసులో దేశాధ్యక్షుడిగా ఎన్నిక

కామెరూన్ అధ్యక్షుడిగా పాల్ బియా(92) ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించారు. ఈనెల 12న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు అక్కడి రాజ్యాంగ మండలి ఇవాళ ప్రకటించింది. సుమారు 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి 1982 నుంచి ప్రెసిడెంట్‌గా బియా కొనసాగుతుండటం గమనార్హం. మరోవైపు ప్రతిపక్షాల మద్దతుదారులు ఆందోళన చేపట్టగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయారు.


