News March 4, 2025
హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని డిమాండ్

TG: హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ డిమాండ్ చేశారు. ఎయిర్‌పొల్యూషన్, PAK, చైనాకు ఢిల్లీ దగ్గరలో ఉండటంతో దేశ రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని నిన్న HYDలో జరిగిన సమావేశంలో కోరారు. ‘సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇక్కడే జరపాలి. HYDను దేశానికి రెండో రాజధాని చేయాలి’ అని సదస్సులో పేర్కొన్నారు.
Similar News
News March 4, 2025
రోహిత్ అలా ఆడితే భారీ స్కోరు ఖాయం: మంజ్రేకర్

నేడు AUSతో జరిగే సెమీస్ మ్యాచ్‌లో రోహిత్ ఎలా ఆడతారన్నదే కీలకమని వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘గిల్, విరాట్, అయ్యర్ వారిదైన శైలిలో ఆడుకుంటూ వెళ్లిపోతారు. కానీ రోహిత్ మాత్రం వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు చూడాలి. ప్రత్యర్థి స్పిన్నర్లు వచ్చే సమయానికి ఆయన కుదురుకుంటే భారీ స్కోరు సాధ్యపడుతుంది. ఇది 350 పిచ్ కాదు. దానికి తగ్గట్టుగా తుది స్కోరును ప్లాన్ చేసుకోవాలి’ అని సూచించారు.
News March 4, 2025
బ్లూఫ్లాగ్ రద్దు.. ఇద్దరు అధికారులపై వేటు

AP: విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ హోదా <<15639382>>గుర్తింపు <<>>రద్దుకు బాధ్యుల్ని చేస్తూ ఇద్దరు అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణి, RJD రమణను తప్పించింది. బీచ్‌పై వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీచ్ పరిశుభ్రతపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తోంది.
News March 4, 2025
ట్రంప్‌తో ట్రూడో ఢీ: ప్రతీకార టారిఫ్స్ ప్రకటన

అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ తగ్గేవరకు తామూ తగ్గమని PM జస్టిన్ ట్రూడో అన్నారు. ‘ఈ అన్యాయానికి కెనడా బదులివ్వకుండా ఉండదు. తొలి దశలో $20.6B US ఉత్పత్తులపై మేమూ 25% టారిఫ్స్ వేస్తాం. 3 వారాల్లోపు రెండో దశలో మరో $80Bకు విస్తరిస్తాం’ అని ట్రూడో తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే రెండేళ్లలోనే కెనడా ప్రొడక్షన్ 3% మేర తగ్గుతుందని బ్యాంక్ ఆఫ్ కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.