News April 8, 2025
పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్

TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాళ్టి నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తాము కాలేజీలు నడపలేకపోతున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందించింది. ఆస్తులు అమ్మి కాలేజీలు నడుపుతున్నామని, నాలుగేళ్లుగా బకాయిలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
Similar News
News November 25, 2025
500 దాటిన సౌతాఫ్రికా ఆధిక్యం

భారత్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా మరింత పట్టు బిగిస్తోంది. ఆ జట్టు ఆధిక్యం 503 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 రన్స్ చేసిన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 215 రన్స్ చేసింది. క్రీజులో ఉన్న స్టబ్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అటు వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. జడేజా 3 వికెట్లు పడగొట్టారు.
News November 25, 2025
బిహార్ ఓటమి.. ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

బిహార్ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఏడుగురు కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. క్రమశిక్షణ, పార్టీ సంస్థాగత సూత్రాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఆదిత్య పాశ్వాన్, షకీలుర్ రెహమాన్, రాజ్ కుమార్ శర్మ, రాజ్‌కుమార్ రాజన్, కుందన్ గుప్తా, కాంచన కుమారి, రవి గోల్డెన్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ బిహార్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఉత్తర్వులిచ్చారు.
News November 25, 2025
మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధాన కాబోయే భర్త

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. 2 రోజుల క్రితం పలాశ్ ఎసిడిటీ, వైరల్ ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో చేరి డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని SVR ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పెళ్లి వేళ స్మృతి తండ్రి గుండెపోటుకు గురికావడంతో పలాశ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడని ఆయన తల్లి అమిత తెలిపారు. 4 గంటలు ఏడ్చాడని వెల్లడించారు.


