News March 28, 2025

జస్టిస్ వర్మపై FIR నమోదు చేయాలని డిమాండ్

image

ఢిల్లీ హైకోర్టు జడ్జి <<15855499>>యశ్వంత్ వర్మపై<<>> FIR నమోదు చేయాలని మాథ్యూ నెడుంపారా అనే లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ అనవసరమని మాథ్యూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసుల నేతృత్వంలో దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 28, 2026

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి సవిత

image

AP: త్వరలో DSC నోటిఫికేషన్ విడుదల కానుందని మంత్రి సవిత తెలిపారు. BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో BC అభ్యర్థులకు ఉచిత శిక్షణిస్తామని, జిల్లాల వారీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విజయవాడ గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలోని సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా 100 మంది BC అభ్యర్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నట్లు తెలిపారు.

News January 28, 2026

ఫ్యాన్ వార్స్ వల్ల సినిమాలకు నష్టం లేదు: అనిల్ రావిపూడి

image

సినిమా రిజల్ట్‌పై ఫ్యాన్ వార్స్ ప్రభావం ఏమాత్రం ఉండదని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఓ హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు ఇతర హీరోల అభిమానులు నెగటివ్ ప్రచారం చేయడంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఏం చేసినా ఫ్యాన్ వార్స్ ఆగవు. కానీ వాటి వల్ల సినిమాకి వచ్చే రెవెన్యూలో అర్ధ రూపాయి కూడా తగ్గదు’ అని అభిప్రాయపడ్డారు. మూవీ బాగుంటే ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్ ఆదరిస్తారని పేర్కొన్నారు.

News January 28, 2026

జనవరి 28: చరిత్రలో ఈరోజు

image

1865: జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ జననం (ఫొటోలో)
1885: భాషా పరిశోధకుడు గిడుగు వెంకట సీతాపతి జననం
1920: నిర్మాత, దర్శకుడు బి.విఠలాచార్య జననం
1929: భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న జననం
1950: భారత సుప్రీంకోర్టు ప్రారంభం
1986: హీరోయిన్ శ్రుతి హాసన్ జననం
2004: నటుడు, దర్శకుడు పామర్తి సుబ్బారావు మరణం
2014: దర్శకుడు, నట శిక్షకుడు బీరం మస్తాన్‌రావు మరణం