News August 25, 2024
బిగ్‌బాస్ నుంచి నాగార్జునను తప్పించాలని డిమాండ్

చెరువును ఆక్రమించి <<13929013>>N-కన్వెన్షన్<<>> నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో నాగార్జునను బిగ్‌బాస్ హోస్ట్‌గా తప్పించాలని ప్రముఖ హేతువాది బాబు గోగినేని డిమాండ్ చేశారు. ‘అక్రమ కట్టడాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు తక్షణమే మార్చాలి. లేదంటే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఆయన్ను ఎలిమినేట్ చేయాలి’ అని FBలో పోస్ట్ చేశారు. బాబు గతంలో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Similar News
News February 10, 2026
రాహుల్ చూపించిన ఆ బుక్‌లో ఏముంది..?

MM నరవణె బుక్‌లోని ‘గల్వాన్ దాడి’ గురించి CARAVAN మ్యాగజైన్ పోస్ట్ చేసింది. ఆ కథనం ప్రకారం ‘చైనా సేన మన స్థావరాలకు 1km దూరంలో మోహరించింది. కానీ స్పష్టమైన ఆదేశాల్లేకుండా కాల్పులు చేయొద్దని ఢిల్లీ నిబంధన. దీంతో రక్షణ మంత్రి, NSA, MEAలకు ఫోన్లో విషయం చెప్పా. కాసేపటికి DM ఫోన్ చేసి మోదీతో మాట్లాడా ‘ఏది మంచిదన్పిస్తే అది చేయండి’ అన్నట్లు చెప్పారు. దీంతో PMకు స్పష్టత లేదు అన్పించింది’ అని MM భావించారట.
News February 10, 2026
IPLకూ హర్షిత్ రాణా డౌటే!

టీమ్ ఇండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా సోమవారం సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్ నుంచి మాత్రమే కాకుండా త్వరలో రాబోయే IPL సీజన్ నుంచి కూడా ఆయన దాదాపు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాణా గాయపడ్డారు. త్వరలో బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్టు చేయనున్నారు.
News February 10, 2026
పిల్లల్లో ADHDకి మందులు వాడుతున్నారా?

పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివ్ డిసీజ్(ADHD) నిర్ధారణ అయిన వెంటనే కొందరు వైద్యులు మందులు సిఫార్సు చేస్తారు. కానీ ఇది సరికాదంటోంది స్టాన్‌ఫర్డ్ మెడిసిన్ తాజా అధ్యయనం. ఆరేళ్లలోపు పిల్లల్లో మందులను ప్రాసెస్ చేసే మెటబాలిజం పూర్తిగా అభివృద్ధి చెందదు. దాంతో ఈ చికిత్స వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదంటున్నారు. మందులకంటే ముందు వాళ్లకు బిహేవియరల్ థెరపీ ఇవ్వాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.


