News February 19, 2025
ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని డిమాండ్

తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. ఉ.10 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో స్కూళ్లలో ఈసారి ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సాధారణంగా మార్చి మూడో వారం నుంచి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. పరీక్షలు ముగిసే వరకు ఉ.7.45 నుంచి మ.12.30 వరకు స్కూళ్లు పని చేస్తాయి.
Similar News
News February 21, 2025
24 నుంచి ఆధార్ స్పెషల్ శిబిరాలు

AP: ఈ నెల 24-28 వరకు అన్ని జిల్లాల్లో ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు. ఆరేళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు, పాత వాటిలో మార్పులకు ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా రాష్ట్రంలో ఆరేళ్లలోపు 8.53L మంది, ఆ పైబడిన వారికి సంబంధించి 42.10L మంది ఆధార్ అప్డేట్ నమోదు పెండింగ్లో ఉందన్నారు.
News February 21, 2025
OTTలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’

బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.170 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించగా, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు.
News February 21, 2025
శివరాత్రి జాతరకు ఘనంగా ఏర్పాట్లు

TG: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం శివరాత్రి వేడుకకు ముస్తాబవుతోంది. ఈ నెల 25,26,27 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గుడి చెరువు మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ప్రధాన ఆలయం వరకూ ఉచిత బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు.