News September 14, 2024
మంచిర్యాల, పెద్దపల్లిలోనూ వందేభారత్ ఆపాలని డిమాండ్

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. TGలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రాలైన మంచిర్యాల, పెద్దపల్లిలోనూ ఈ రైలును ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. మంగళవారం మినహా నాగ్‌పూర్‌లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.
Similar News
News December 30, 2025
నిమ్మలో గానోడెర్మా తెగులు – నివారణ

నిమ్మచెట్ల కాండంపై పుట్టగొడుగుల మాదిరిగా ఏర్పడి చెట్లు క్షీణించడాన్ని గానోడెర్మా తెగులు అంటారు. పుట్టగొడుగులు లాంటివి కాండంపై గుర్తిస్తే చాకుతో వాటిని తీసివేసి, కాల్చి వేయాలి. తర్వాత తెగులు సోకిన భాగాలపై బోర్డోపేస్టును పూయాలి. 1 శాతం బోర్డో మిశ్రమాన్ని లేదా లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. చొప్పున కలిపిన ద్రావణాన్ని పీచువేర్లు తరలించేటట్లు పాదుల్లో పోయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 30, 2025
పుతిన్ ఇంటిపై దాడి.. ‘నాకు చాలా కోపం వస్తోంది’ అన్న ట్రంప్!

పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయం తనతో పుతిన్ స్వయంగా చెప్పారన్నారు. ఇది చాలా తప్పని.. తనకు చాలా కోపం వస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే రష్యా చేస్తున్న ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కొట్టిపారేశారు. ఇవన్నీ అబద్ధాలని.. శాంతి చర్చలను పక్కదారి పట్టించేందుకే రష్యా ఇలాంటి డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.
News December 30, 2025
చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని.. మృత్యువులోనూ..

US యాక్సిడెంట్‌లో ఇద్దరు యువతులు మరణించడంతో పేరెంట్స్ గుండెలు బాదుకుంటున్నారు. మహబూబాబాద్(D)కు చెందిన <<18701423>>మేఘన<<>> (25), భావన(24) చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. మూడేళ్ల క్రితం USకు వెళ్లి డేటన్ యూనివర్సిటీలో MS చేశారు. సోమవారం మరో ఇద్దరు ఫ్రెండ్స్ (HYD)తో కలిసి యాత్రకు వెళ్లారు. కారు లోయలో పడటంతో మేఘన, భావన మరణించగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.


