News July 6, 2024

టీటీడీ, పోర్టుల్లో తెలంగాణ వాటా కోరడం ఆందోళనకరం: బొత్స

image

AP: ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విభజన సమస్యల పరిష్కారానికి జరగనున్న సమావేశంలో ఏపీ పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న <<13573822>>వార్తలు<<>> రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి సీఎంల భేటీని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 26, 2025

ఘనపూర్‌లో అత్యధికం.. శ్రీరంగాపూర్‌లో అత్యల్పం

image

వనపర్తి జిల్లాలో అత్యధికంగా ఘనపూర్ మండలంలో 29 పంచాయతీలు ఉండగా, అత్యల్పంగా శ్రీరంగాపూర్ మండలంలో 8 పంచాయతీలు ఉన్నాయి. ఘనపూర్‌కు తొలి విడతలో, శ్రీరంగాపూర్‌కు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఘనపూర్ తర్వాత పానగల్ మండలంలో 28 పంచాయతీలకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది.

News November 26, 2025

రెండో టెస్ట్ డ్రాగా ముగిస్తే గెలిచినట్లే: జడేజా

image

SAతో రెండో టెస్టులో ఐదో రోజు తమ బెస్ట్ ఇస్తామని IND ఆల్‌రౌండర్ జడేజా అన్నారు. ‘ఈ మ్యాచును డ్రాగా ముగిస్తే విజయం సాధించినట్లే. సిరీస్ ఓడాలని ఎవరూ కోరుకోరు. వచ్చే సిరీస్‌పై దీని ప్రభావం ఉండదు. టీమ్‌లో ఎక్కువగా యంగ్ ప్లేయర్లున్నారు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్‌లో బాగా రాణిస్తారు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు. IND గెలవాలంటే ఇంకా 522 రన్స్ చేయాలి. చేతిలో 8 వికెట్లున్నాయి.

News November 26, 2025

స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి.. కీలక అంశాలు

image

TG: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాజకీయ పార్టీలు, నేతలు, పోటీ చేసే అభ్యర్థులకు, ప్రభుత్వోద్యోగులకు వర్తిస్తుంది. షెడ్యూల్ ప్రకటన నుంచి ఎన్నికలయ్యే వరకు అమల్లో ఉంటుంది
⁎ కులమతాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయకూడదు. మతం/కులం పేరుతో ఓట్లు అడగొద్దు
⁎ దేవాలయాలు, మసీదులు, చర్చిలను ప్రచారానికి వాడొద్దు
⁎ అభ్యర్థుల వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేయొద్దు
⁎ సభలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి