News November 27, 2024

బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కావాలని డిమాండ్లు.. మీరేమంటారు?

image

ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కావాలనే డిమాండ్ పెరుగుతోంది. నిన్న జగన్, మల్లికార్జున ఖర్గే ఈవీఎంలు వద్దని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో యాత్ర చేయాలని ఖర్గే కోరారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. EVMలతో పేద, బడుగు బలహీన వర్గాల ఓట్లు వృథా అవుతున్నాయని, వాళ్లంతా బ్యాలెట్ పేపర్ పద్ధతే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News December 1, 2025

డిసెంబర్ నెలలో పర్వదినాలు

image

DEC 1: గీతా జయంతి, సర్వ ఏకాదశి
DEC 2: మత్స్య, వాసుదేవ ద్వాదశి, చక్రతీర్థ ముక్కోటి
DEC 3: హనమద్ర్వతం, DEC 4: దత్త జయంతి
DEC 8: సంకటహర చతుర్థి
DEC 12: కాలభైరవాష్టమి
DEC 14: కొమురవెళ్లి మల్లన్న కళ్యాణం
DEC 15: సర్వ ఏకాదశి
DEC 16: ధనుర్మాసం ప్రారంభం
DEC 30: ముక్కోటి ఏకాదశి

News December 1, 2025

చిరు-వెంకీ సాంగ్.. 500 మంది డాన్సర్లతో షూటింగ్

image

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నుంచి ఓ అప్డేడ్ చక్కర్లు కొడుతోంది. గచ్చిబౌలిలో భారీ సెట్ వేసి మెగాస్టార్-విక్టరీ వెంకటేశ్‌ కాంబినేషన్‌లో సాంగ్ షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 500 మంది డాన్సర్లతో ఈ పాటను గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నట్లు చెప్పాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీని 2026 సంక్రాంతి బరిలో నిలపనున్నారు.

News December 1, 2025

విటమిన్-E ఫుడ్స్‌తో చర్మం, గుండె ఆరోగ్యం పదిలం!

image

విటమిన్-E ఉండే ఆహార పదార్థాలు చర్మం, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. బాదం, సన్ ఫ్లవర్ గింజలు, పాలకూర, బ్రకోలీ, కివీ, ఆలివ్ నూనె, అవకాడో డైట్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. బాదం, అవకాడో చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు గుండె పనితీరును మెరుగు పరుస్తాయంటున్నారు. బ్రకోలీ ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుందని, కివీతో చర్మ ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుందని చెబుతున్నారు.