News October 5, 2025
డీమార్ట్ ఆదాయం పెరుగుదల

డీమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆదాయం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆ సంస్థ ఆదాయం రూ.16,219 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ.14,050కోట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. 2025 సెప్టెంబర్ నాటికి దేశంలో డీమార్ట్ స్టోర్ల సంఖ్య 432కు చేరింది. ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో డీమార్ట్ బిజినెస్ నిర్వహిస్తోంది.
Similar News
News October 5, 2025
వారిని కఠినంగా శిక్షించాలి: KTR

మధ్యప్రదేశ్ చింద్వారాలో కోల్డ్రిఫ్ <<17918452>>దగ్గు మందు<<>> తాగిన 11 మంది చిన్నారులు మృతిచెందిన ఘటనపై KTR దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా ఘోరం. ఈ మందు తయారు చేసిన కంపెనీ మేనేజ్మెంట్, దానిని అప్రూవ్ చేసిన అథారిటీలను కఠినంగా శిక్షించాలి. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. కారకులందరినీ జైలులో వేయాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.
News October 5, 2025
5,346 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

<
News October 5, 2025
వారానికి మటన్ ఎంత తింటే మంచిదంటే?

మటన్‌లో శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు, మినరల్స్, ఐరన్ ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు దోహదపడతాయి. అయినా అతిగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణ ప్రజలు వారానికి 100 గ్రా., శారీరక శ్రమ చేసేవాళ్లు 200 గ్రా. వరకు తినొచ్చు. అతిగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరిస్తున్నారు.