News March 22, 2024
ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది: చద్దా

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. ‘ఎమర్జెన్సీని ప్రకటించనప్పటికీ.. ఇండియాలో పరిస్థితులు అలానే ఉన్నాయి. ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంలను లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం చూడలేదు. బలమైన ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 16, 2026
మెదక్: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. మెదక్ డివిజన్‌లో 24, సంగారెడ్డి డివిజన్‌లో 19 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం వివరాలు: ☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380 ☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470.
News February 16, 2026
BREAKING: తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గి రూ.1,56,440కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పతనమై రూ.1,43,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 16, 2026
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 140+ పాయింట్ల లాభంతో 82,768 వద్ద కదలాడుతోంది. అటు నిఫ్టీ సైతం 42 పాయింట్ల లాభంతో 25,515 వద్ద ఊగిసలాడుతోంది.


