News July 11, 2024
YCP ఆఫీసు కూల్చివేత.. అధికారులకు హైకోర్టు నోటీసులు

AP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న YCP ఆఫీసు కూల్చివేత ఘటనపై ఆ పార్టీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. CRDA కమిషనర్ కాటమనేని భాస్కర్, తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని న్యాయస్థానం సూచించినా ఆఫీసును కూల్చివేయడం కోర్టు ధిక్కరణే అని YCP తరఫు లాయర్ పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
రేపు కార్తీక మాసం చివరి సోమవారం.. ఏం చేయాలంటే?

కార్తీక మాసం చివరి సోమవారం శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే స్నానం చేయాలి. శివాలయానికి వెళ్లి బిల్వ పత్రాలు సమర్పించాలి. నీళ్లు/పాలు, పెరుగు, తేనె, గంగాజలంతో అభిషేకం చేయించాలి. 365 వత్తులతో దీపాలు వెలిగించాలి. ఉపవాసం ఉండి అన్నదానం, వస్త్రదానం చేయాలి. ఆవుకు ఆహారం పెట్టాలి. దీనివల్ల ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
News November 16, 2025
ముందే పంచాయతీ.. ఆ తర్వాతే పరిషత్ ఎన్నికలు?

TG: పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 2 విడతలుగా ముందు MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోర్టులో కేసు విచారణ ఉండటం, అటు 15 ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.
News November 16, 2025
Infosys ఉద్యోగులకు 75% బోనస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. SEP త్రైమాసికానికి సగటున 75% బోనస్ ప్రకటించింది. ఔట్‌స్టాండింగ్ పనితీరు కనబర్చిన వారికి 83%, ఉత్తమ పనితీరు ప్రదర్శించిన వారికి 78.5%, అంచనాలు అందుకున్నవారికి 75% లభించనుంది. గతంలో కంటే 7-8% తగ్గినప్పటికీ అన్ని కేటగిరీల్లో సగటున 70.5%-83% అందనుంది. లెవల్ 4, 5, 6లోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లకు ఈ బోనస్ లభిస్తుంది.


