News August 27, 2024
డెంగ్యూ.. మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?

AP, TGలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మీలో ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోండి. తీవ్రమైన తలనొప్పి, 102 డిగ్రీలకు పైగా జ్వరం, చలి జ్వరం, కీళ్ల నొప్పులు, కంటి నొప్పి, నీరసంతో పాటు చర్మంపై దద్దుర్లు, ఎముకలు లేదా కండరాల నొప్పి, వికారం, వాంతులు, ఊపిరి తీసుకోవడంతో ఇబ్బంది ఎదురవుతాయి. డెంగ్యూకు ప్రత్యేకమైన మెడిసిన్ అంటూ ఏమీ లేదు. లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తారు.
Similar News
News November 2, 2025
ఇస్రో దేశ ప్రజలను గర్వపడేలా చేస్తోంది: మోదీ

అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ప్రయోగం <<18179210>>విజయవంతం<<>> కావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మన అంతరిక్ష రంగం దేశ ప్రజల్ని గర్వపడేలా చేస్తూనే ఉందని కొనియాడారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘మన సైంటిస్టుల ఘనత వల్ల అంతరిక్ష రంగం నూతన ఆవిష్కరణలకు, ప్రయోగాలకు పర్యాయపదంగా మారింది. వారి విజయాలు దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఎన్నో జీవితాలకు సాధికారత కల్పిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.
News November 2, 2025
రాజకీయ హింస.. ఏడాదిలో 281 మంది మృతి

విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటికీ పొలిటికల్ వయలెన్స్ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది AUG నుంచి ఈ ఏడాది SEP వరకు అల్లర్లలో 281 మంది మరణించారని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. అలాగే అక్రమ నేరారోపణలతో 40 మంది చట్టవిరుద్ధ హత్యలకు గురయ్యారని తెలిపింది. మరో 153 మందిని దారుణంగా ఉరితీశారని పేర్కొంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు జవాబుదారీగా ఉండటం లేదని అభిప్రాయపడింది.
News November 2, 2025
పంకజ్ త్రిపాఠి తల్లి కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి హేమ్వంతి దేవి(89) అనారోగ్యంతో రెండు రోజుల కిందట మరణించారు. బిహార్‌లోని స్వస్థలం గోపాల్‌గంజ్‌లో నిన్న అంత్యక్రియలు కూడా పూర్తయినట్లు నటుడి టీమ్ ఇవాళ ప్రకటించింది. త్రిపాఠి తండ్రి బెనారస్ తివారీ(99) రెండేళ్ల క్రితం చనిపోయారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా పంకజ్ తెలుగు వారికీ దగ్గరైన విషయం తెలిసిందే.


