News June 10, 2024
రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ
కేంద్రమంత్రి పదవులను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైన టీడీపీకి ఇదే శాఖ కేటాయించారు. అప్పటి విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ కేబినెట్ మంత్రిగా పని చేశారు.
Similar News
News January 12, 2025
హింసా రాజకీయాలకు సీఎం రేవంత్ ప్రోత్సాహం: హరీశ్ రావు
TG: INC ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసిందని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. ప్రజలు ఆరు గ్యారంటీలను ప్రశ్నించకుండా ఉండేందుకు CM రేవంత్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రైతు కూలీలు, అన్ని రకాల వడ్లకు బోనస్, రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా స్పందించడం లేదని ఫైరయ్యారు. ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు కూడా రైతు కూలీలేనని, వారికి కూడా రూ.12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News January 12, 2025
మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాగే మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ జరుగుతుందని చెప్పారు. బీసీసీఐ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్‌కు కొత్త కమిషనర్‌ను ఎన్నుకుంటామని వెల్లడించారు. కాగా తొలుత మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుందని శుక్లా ప్రకటించారు. అనంతరం 21నే ప్రారంభిస్తామని చెప్పారు.
News January 12, 2025
శనగలు ఉడికిస్తూ ఇద్దరు యువకులు మృతి
శనగలు ఉడికించే క్రమంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. నోయిడాకు చెందిన యువకులు శనగలను ఉడికించేందుకు స్టవ్‌పై చిన్న మంటతో పెట్టి మరిచిపోయారు. రాత్రంతా అలాగే ఉండడంతో ఆ మంట నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలైంది. ఈ విషపూరితమైన వాయువుకు రంగు, రుచి, వాసన ఉండదు. ఇంటి డోర్, కిటికీలు క్లోజ్ చేసి ఉండడంతో ఆ వాయువు గదంతా వ్యాపించింది. దీంతో ఆక్సిజన్ అందక వారిద్దరూ స్పృహ కోల్పోయి చనిపోయారు.