News June 12, 2024
శాఖల వారీగా శ్వేతపత్రాలు: చంద్రబాబు

AP: జగన్ నాశనం చేసిన వ్యవస్థలను మనం బాగుచేయాలని మంత్రులతో భేటీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర పునర్మిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదాం’ అని సూచించారు.
Similar News
News October 28, 2025
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం

TG: హైదరాబాద్లో వర్షం దంచికొడుతోంది. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రాలో వాన పడుతోంది. రాత్రి 7.30 గంటల్లోపు నగరమంతా వర్షం విస్తరిస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
సర్జరీ విజయవంతం.. కోలుకున్న శ్రేయస్!

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నారని Cricbuzz తెలిపింది. Spleen(ప్లీహం)కు గాయం కాగా సిడ్నీ వైద్యులు మైనర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పింది. నిన్ననే ICU నుంచి బయటికొచ్చిన అయ్యర్ మరో 5 నుంచి 7 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొంది. ఇదే నిజమైతే అతడు త్వరలో మైదానంలో అడుగుపెట్టే ఛాన్సుంది.
News October 28, 2025
ఆ వ్యాయామాలతో బ్రెస్ట్ క్యాన్సర్ కట్టడి

మహిళల్లో వేగంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకూ తగ్గించడంలో రెసిస్టెన్స్ ట్రైనింగ్, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వ్యాయామాలు పనిచేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వ్యాయామాల వల్ల మయోకిన్స్ రిలీజై రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకు నెమ్మదిస్తుందని తేలింది.


