News March 28, 2025
జూన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు

జూన్ 6 నుంచి 12వరకు ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించనున్నట్లు APPSC తెలిపింది. ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అటు రాష్ట్రంలో వివిధ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలు ముగిసినట్లు వెల్లడించింది. ఇందులో NTR హెల్త్ వర్సిటీ లైబ్రేరియన్, PCB అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, ఎనలిస్ట్ గ్రేడ్-2, విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నట్లు తెలిపింది.
Similar News
News December 7, 2025
‘EU’ని రద్దు చేయాలి: ఎలాన్ మస్క్

యూరోపియన్ కమిషన్ ‘X’కు 140 మిలియన్ డాలర్ల <<18483215>>ఫైన్<<>> విధించడంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘యూరోపియన్ యూనియన్ను రద్దు చేయాలి. సార్వభౌమాధికారాన్ని దేశాలకు తిరిగి ఇవ్వాలి. తద్వారా ప్రభుత్వాలు తమ ప్రజలకు బాగా ప్రాతినిధ్యం వహించగలుగుతాయి’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌ను ఓ యూజర్ షేర్ చేయగా.. ‘నా ఉద్దేశం అదే.. నేను తమాషా చేయట్లేదు’ అని పునరుద్ఘాటించారు.
News December 7, 2025
డిసెంబర్ 07: చరిత్రలో ఈ రోజు

1792: భారత్‌లో పోలీసు వ్యవస్థను ప్రవేశపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ
1896: తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణమూర్తి జననం
1975: డైరెక్టర్ సురేందర్ రెడ్డి జననం
2013: హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(ఫొటోలో) మరణం
*భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
*అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
News December 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


