News April 29, 2024
ఓయూలో సమస్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి

TG: ఓయూలో నీళ్లు, విద్యుత్ కొరతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ పోతోందని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌పై అభాండాలు మోపాలని చూస్తున్నారని అన్నారు.
Similar News
News November 22, 2025
లేబర్ కోడ్స్‌పై మండిపడ్డ కార్మిక సంఘాలు

కేంద్రం అమల్లోకి తెచ్చిన 4 <<18350734>>లేబర్ కోడ్స్<<>>ను కార్మిక సంఘాలు ఖండించాయి. కార్మికులకు నష్టం కలిగించేలా, కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని 10 లేబర్ యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ‘ఇది అత్యంత అప్రజాస్వామిక చర్య. శ్రామికులపై యుద్ధం ప్రకటించడం తప్ప మరేమీ కాదు. పెట్టుబడిదారులతో ప్రభుత్వం కుమ్మక్కైంది’ అని మండిపడ్డాయి. లేబర్ కోడ్స్‌ను విత్ డ్రా చేసుకునే దాకా తాము పోరాటం చేస్తామని ప్రకటించాయి.
News November 22, 2025
20 ఏళ్ల తర్వాత కీలక శాఖ వదులుకున్న నితీశ్

కొత్తగా కొలువుదీరిన బిహార్ క్యాబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపులు పూర్తయ్యాయి. 20 ఏళ్లుగా తన వద్దే ఉంచుకున్న కీలకమైన హోం శాఖను సీఎం నితీశ్ కుమార్ వదులుకున్నారు. డిప్యూటీ సీఎం చౌధరి(BJP)కి ఇచ్చారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా(BJP)కు రెవెన్యూ, గనుల శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలన, విజిలెన్స్ వంటి శాఖలు మాత్రమే నితీశ్ తన వద్ద ఉంచుకున్నారు.
News November 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


