News June 21, 2024

అధికారులను నిలదీసిన డిప్యూటీ CM పవన్ కళ్యాణ్

image

AP: 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను నిలదీశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. CFMS ఖాతాకు ఎన్ని ఆర్థిక సంఘం, స్థానిక సంస్థల నిధులను మళ్లించారో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు సీజనల్ వ్యాధుల కట్టడికి కార్యాచరణ రూపొందించాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News February 4, 2025

బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు

image

హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. మస్తాన్‌సాయి, శేఖర్‌ బాషా కాల్ సంభాషణలను అందజేశారు. పలువురు మహిళల అభ్యంతరకర వీడియోలు కలిగి ఉన్నారని మస్తాన్ సాయిపై నిన్న లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

News February 4, 2025

కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన రేవంత్

image

TG: కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే చేశామన్నారు. 50 రోజుల పాటు సర్వే చేశామని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసమే ఈ సర్వే నిర్వహించామని వెల్లడించారు.

News February 4, 2025

ఇలా చేస్తే క్యాన్సర్ దరిచేరదు!

image

ఎప్పుడు, ఎలా క్యాన్సర్ సోకుతుందో చెప్పలేం. కానీ, కొన్ని జాగ్రత్తలు ఈ వ్యాధిని దరిచేరనివ్వవు. ఈక్రమంలో వైద్యులు పేర్కొన్న కొన్ని సలహాలు మీకోసం. ధూమపానం చేయొద్దు. హెల్తీ ఫుడ్ తినండి. హెపటైటిస్ బి& HPV నివారణకు టీకాలు వేసుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఉపయోగించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మద్యం మానుకోండి. ప్రాసెస్డ్ మాంసం వద్దు. పండ్లు & కూరగాయలు తినండి, పుష్కలంగా నీరు తాగండి, గుడ్లు తినండి.

error: Content is protected !!