News February 7, 2025

బీసీకి డిప్యూటీ సీఎం పదవి.. రేవంత్ యోచన?

image

TG: రాష్ట్రంలో బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో CM రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణలో ఇద్దరు BCలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక Dy.CM పదవి ఉంటుందని టాక్. ST, మైనార్టీ, రెడ్డి, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

Similar News

News April 1, 2026

కేజీబీవీ దరఖాస్తు గడువు 10వరకు పొడిగింపు

image

AP: KGBV స్కూళ్లలో 2026-27లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగిస్తున్నట్లు SSA ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. 6, 11 తరగతుల్లో అన్ని సీట్లతో పాటు 7, 8, 9, 10, 12 క్లాసుల్లో ఖాళీ సీట్లకు బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుకు ఇవాళ్టితో గడువు ముగియగా పేరెంట్స్ వినతి మేరకు పెంచినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలన్నారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి అప్లై చేయొచ్చు.

News April 1, 2026

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్

image

TG: విద్యుత్ వినియోగదారులందరికీ శుభవార్త. 2026లో గృహ అవసరాలకు వాడే విద్యుత్‌కు ఛార్జీల పెంపు లేదని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నాన్- డొమెస్టిక్ వినియోగదారులకు పీక్ అవర్స్‌లో వర్తించే ToD (Time of Day) ఛార్జీని యూనిట్‌కు రూ.1 నుంచి రూ.1.50కి పెంచింది. అటు కరెంట్ షాక్‌కు గురైన వారికి అందించే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది.

News April 1, 2026

రేపు ప్రధానితో లోకేశ్ భేటీ

image

AP: మంత్రి లోకేశ్ ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉ.10.30 గం.కు ప్రధాని మోదీని కలిసి అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు. అంతకుముందు అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చను మొత్తం టీవీలో చూశానని లోకేశ్ తెలిపారు. జ‌గ‌న్ ఎన్ని జ‌న్మ‌లెత్తినా అమ‌రావ‌తిలో ఒక్క ఇటుక‌నూ తాక‌లేడని స్పష్టం చేశారు.