News September 8, 2024
రేపు కాకినాడలో డిప్యూటీ సీఎం పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి బయల్దేరి 9.45 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి కాకినాడ కలెక్టరేట్‌కు వెళ్లి ఏలేరు రిజర్వాయర్‌కు వరద ఉద్ధృతి, జిల్లాలో వరద ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
Similar News
News January 29, 2026
లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్

ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిలిచ్చింది. రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.
News January 29, 2026
‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా FTA: ప్రధాని మోదీ

భారత్, EU వాణిజ్య ఒప్పందం దేశ భవిష్యత్‌కు కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా ఈ ఒప్పందం మారిందన్నారు. ఈ FTA యువతకు, ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తుందని చెప్పారు. మన వస్తువులకు అతిపెద్ద మార్కెట్ దక్కిందని, బ్రాండ్‌కు గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తయారీ, సర్వీస్ సెక్టార్లలోనూ దేశ భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు.
News January 29, 2026
నవగ్రహాలు – ప్రీతికరమైన వస్త్రధారణ

ఆదిత్యుడు – ఎరుపు వస్త్రం
చంద్రుడు – తెలుపు వస్త్రం
అంగారకుడు – ఎరుపు వస్త్రం
బుధుడు – పచ్చని వస్త్రం
గురు – బంగారు రంగు వస్త్రం
శుక్రుడు – తెలుపు వస్త్రం
శని – నలుపు వస్త్రం
రాహువు – నలుపు వస్త్రం
కేతువు – రంగురంగుల వస్త్రం


