News October 18, 2025

NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు

image

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL)34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోరు సాధించిన వారు NOV 3వరకు అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక ఉంటుంది. నెలకు రూ.50వేల నుంచి రూ.1.60లక్షల వరకు జీతం అందుతుంది. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

Similar News

News October 18, 2025

మినుములో మారుకా పురుగు.. వేపనూనెతో చెక్

image

మినుము మొగ్గ, పిందె దశలలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఒక తల్లి పురుగు 200-500 గుడ్లను పెడుతుంది. వాటి లార్వాలు బయటకు వచ్చి మొగ్గలు, పిందెలను తినేస్తాయి. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు నివారణకు 5మి.లీ వేప నూనె లేదా నొవల్యూరాన్ 1.0మి.లీ లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5-10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.

News October 18, 2025

చీర కట్టినప్పుడు పొడవుగా కనిపించాలంటే..

image

కాస్త ఎత్తు తక్కువగా ఉండి, లావుగా ఉన్నవారు కొన్ని టిప్స్ పాటిస్తే చీర కట్టుకున్నప్పుడు పొడవుగా, అందంగా కనిపిస్తారంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. మృదువైన సిల్కు ప్లెయిన్ చీరకు చిన్న అంచు ఉన్నవి ఎంచుకోవాలి. దీనిపై మీడియం ప్రింట్స్ ఉన్న బ్లౌజ్ వెయ్యాలి. డీప్‌నెక్ బ్లౌజ్‌ వేసుకోవాలి. పెద్ద బోర్డర్లున్న చీరలు, పెద్ద ప్రింట్స్ ఉన్నవి ఎంచుకోకూడదు. నెక్ విషయానికొస్తే హైనెక్, క్లోజ్ నెక్‌కు దూరంగా ఉండాలి.

News October 18, 2025

రాష్ట్రంలో 34 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>APPSC<<>> నోటిఫికేషన్ విడుదల చేసిన వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (3), రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (1), వార్డెన్(1), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్(1) పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 28 ఆఖరు తేదీ. వెల్ఫేర్ ఆర్గనైజర్(10), జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్(7), Jr అకౌంట్(7), Sr అకౌంట్స్(4) పోస్టులకు అప్లై చేయడానికి OCT 29 చివరి తేదీ. అర్హతలు గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.