News February 12, 2025

యోగా, జిమ్ చేస్తూ ఫిట్‌గా ఉన్నా హార్ట్ ఎటాక్ వచ్చింది: పరిణీత తండ్రి

image

మధ్యప్రదేశ్‌కు చెందిన పరిణీత సంగీత్ వేడుకలో డాన్స్ చేస్తూ <<15414198>>గుండెపోటుతో<<>> చనిపోయిన ఘటనపై ఆమె తండ్రి సురేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వారం క్రితమే పరిణీత అన్ని టెస్టులు చేయించుకోగా నార్మల్ అని వచ్చింది. ఆమె చనిపోతుందనే ముందస్తు హెచ్చరిక, సంకేతం ఏదీ కనిపించలేదు. ఆమె ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టేది. రోజూ యోగా, జిమ్ చేస్తూ ఫిట్‌గా ఉండేది’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Similar News

News February 13, 2025

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం ఎవరిదంటే?

image

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మళ్లీ BJPనే అధికారం చేపడుతుందని INDIA టుడే-Cఓటర్ సర్వే తెలిపింది. BJP ఒంటరిగానే 281 సీట్లు, NDA కూటమి మొత్తంగా 343 స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది. గత ఎన్నికల్లో 232 సీట్లు గెలుపొందిన INDIA కూటమి 188 స్థానాలకు పడిపోతుందని, కాంగ్రెస్ 78 సీట్లకే పరిమితం కానుందని పేర్కొంది. JAN 2 నుంచి FEB 9 వరకు 1,25,123 మందిపై సర్వే జరిపినట్లు తెలిపింది.

News February 12, 2025

కొత్త 50 రూపాయల నోట్లు

image

ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈమేరకు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న చాలా నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ప్రింట్ అయ్యాయి. ఆయన స్థానంలో గతేడాది డిసెంబర్‌లో వచ్చిన సంజయ్ పేరుతో కొత్త రూ.50 నోట్లను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

News February 12, 2025

కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక సూచన

image

TG: రేషన్ కార్డు దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి వద్దే భద్రపరుచుకోవాలని చెప్పింది. అప్లికేషన్ల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, నిర్దిష్ట గడువు ఏమి లేదని పేర్కొంది. కాగా కొన్ని చోట్ల రేషన్ కార్డు దరఖాస్తులకు భారీగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!