News March 17, 2024
నా రంగు విషయంలో అవమానాలు ఎదుర్కొన్నా: భూమి శెట్టి

తన శరీర రంగు విషయంలో చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని హీరోయిన్ భూమి శెట్టి తెలిపారు. ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘రంగుపై ఇతరుల మాటలతో ఎంతో బాధపడ్డా. ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏవైనా క్రీమ్స్ వాడాలని చెప్పేవారు. ఇప్పటికీ ఇన్‌స్టాలో ఫొటోలకు నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు వాటిని పట్టించుకోవట్లేదు. నా అందం గురించి నాకు తెలుసు’ అని పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
ప్రధాని మోదీకి యూనస్ బహుమతి

బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ విజ్ఞప్తి మేరకు ప్రధాని మోదీ ఆయనతో బ్యాంకాక్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఫొటో ఫ్రేమ్‌ను మోదీకి యూనస్ బహుమతిగా ఇచ్చారు. 2015లో 102వ సైన్స్ కాంగ్రెస్ సభలో యూనస్‌కు మోదీ గోల్డ్ మెడల్ బహూకరించారు. ఆ ఫొటోనే యూనస్ ఫ్రేమ్ చేయించి గిఫ్ట్‌గా ఇచ్చారు. కాగా.. ఇరు దేశాల మధ్య విభేదాల నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.
News April 4, 2025
బర్డ్ ఫ్లూతో చిన్నారి మరణం.. రంగంలోకి కేంద్రం

AP: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో <<15964152>>తొలి మరణం<<>> సంభవించడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీ, ముంబై, మంగళగిరి ఎయిమ్స్‌కు చెందిన పలువురు డాక్టర్లతో కలిసి అధ్యయనం చేయిస్తోంది. నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి ఎప్పుడు అనారోగ్యానికి గురైంది? ఎప్పుడు ఆస్పత్రిలో చేరింది? వైద్యులు ఎలాంటి చికిత్స అందించారు? అనే వివరాలను ఆ బృందం ఆరా తీసింది. చిన్నారి కుటుంబీకులు చికెన్ కొనుగోలు చేసిన దుకాణంలో శాంపిల్స్ సేకరించింది.
News April 4, 2025
తమిళనాడు సర్కారుకు షాక్.. నీట్ మినహాయింపు బిల్లు తిరస్కరణ

తమిళనాడు ప్రభుత్వానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షాక్ ఇచ్చారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలన్న బిల్లును తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ అసెంబ్లీలో వెల్లడించారు. కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. NEET నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు అసెంబ్లీ గతేడాది జూన్‌లో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.