News September 12, 2024

HYD ఇమేజ్‌ను నాశనం చేస్తున్నారు: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘ఎమ్మెల్యే <<14082925>>కౌశిక్‌పై<<>> దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల హైదరాబాద్‌కు పెట్టుబడులు రావడం లేదు. HYD ఇమేజ్‌ను నాశనం చేస్తున్నారు. మా హయాంలో ఇలాంటి దాడులు జరిగాయా? గాంధీ, ఆయన గూండాలపై హత్యానేరం కింద కేసు పెట్టాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News January 21, 2026

అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారిస్తాం: సజ్జనార్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారణకు పిలుస్తామని HYD CP, సిట్ చీఫ్ సజ్జనార్ తెలిపారు. ‘ఈ కేసులో హరీశ్‌ను ఇవాళ విచారించాం. ఆయనకు సుప్రీంకోర్టులో స్టే రాలేదు. తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా ముందుగా బయల్దేరి వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చాం. కేసులో సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించాం’ అని చెప్పారు. ఇవాళ 7గంటలకు పైగా హరీశ్ రావును సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

News January 20, 2026

గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

image

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్‌ కురియన్‌తో AP CM చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, జాప్యం లేకుండా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని CBN కోరారు. IBM ఛైర్మన్ అరవింద్ కృష్ణతోనూ CM సమావేశం అయ్యారు. అమరావతిలో నిర్మించే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌పై చర్చించారు.

News January 20, 2026

రేపే తొలి T20.. IND ప్లేయింగ్ 11 ఇదేనా?

image

IND రేపు NZతో నాగ్‌పూర్ వేదికగా తొలి T20 ఆడనుంది. ఇప్పటికే నం.3లో ఇషాన్ కిషన్ ఫిక్స్ కాగా ప్లేయింగ్ 11 ఇదేనంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలను Xలో పంచుకుంటున్నారు. త్వరలోనే T20 WC ఉండటంతో పెద్దగా ప్రయోగాలు చేయకుండా తొలి మ్యాచ్ ఆడే జట్టునే సిరీస్ మొత్తం కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. టీమ్: అభిషేక్, శాంసన్, కిషన్, సూర్య, హార్దిక్, దూబె, అక్షర్, రింకూ, కుల్దీప్/వరుణ్, అర్ష్‌దీప్, బుమ్రా.