News August 24, 2024

విధ్వంసం.. 27 బంతుల్లో 70 రన్స్

image

మహారాజా ట్రోఫీలో శివమొగ్గ లయన్స్ బ్యాటర్ అభినవ్ మనోహర్ విధ్వంసం సృష్టించారు. కేవలం 27 బంతుల్లో 70 రన్స్‌ చేశారు. 9 సిక్సర్లు, 2 ఫోర్లతో విరుచుకుపడ్డారు. దీంతో హుబ్లీ టైగర్స్ ఇచ్చిన 142 రన్స్ టార్గెట్‌ను శివమొగ్గ 15.1 ఓవర్లలోనే ఛేదించింది. కాగా ఈ టోర్నీలో అభివన్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 52*(29), 84*(34), 5(8), 17(12), 55(36), 46(29) రన్స్ చేశారు.

Similar News

News November 27, 2025

GNT: ఇంటర్‌ విద్యార్థినిపై అఘాయిత్యం..!

image

గుంటూరులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రోసూరుకు చెందిన ఓ బాలిక నగరంలో బంధువుల ఇంట్లో ఉండి ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన తిరుపతయ్య ఆ బాలికను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొద్దిరోజుల తర్వాత బాలికకు వైద్యపరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. ఈ క్రమంలో పోక్సో నమోదు చేశామన్నారు.

News November 27, 2025

ఆ మృగం మూల్యం చెల్లించుకోక తప్పదు: ట్రంప్

image

వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌ వద్ద <<18399882>>కాల్పుల ఘటనపై<<>> US అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. నిందితుడిని మృగంగా సంబోధిస్తూ.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘ఇద్దరు నేషనల్ గార్డ్‌మెన్‌లను ఆ యానియల్ తీవ్రంగా గాయపర్చింది. వారికి చికిత్స అందిస్తున్నాం. నిందితుడిని వదలబోం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాల్పుల నేపథ్యంలో వైట్‌హౌస్‌ను లాక్‌డౌన్ చేసిన విషయం తెలిసిందే.

News November 27, 2025

చెప్పులు, చెత్త డబ్బా.. ‘సర్పంచ్’ గుర్తులివే..

image

TG: సర్పంచ్ అభ్యర్థులకు SEC 30గుర్తులు కేటాయించింది. వీటిలో చెప్పులు, చెత్తడబ్బా, బిస్కెట్, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీస్ పర్స్, రిమోట్, టూత్ పేస్ట్, బ్లాక్ బోర్డు, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మెన్, పడవ, ఫ్లూట్, చైన్, బెలూన్, స్టంప్స్, స్పానర్ గుర్తులున్నాయి. వార్డు అభ్యర్థులకు 20గుర్తులిచ్చింది.