News August 16, 2024

75% దరఖాస్తుల వివరాలు సమర్పించలేదు: ప్రభుత్వం

image

TG: ఇప్పటివరకు 4,28,832 దరఖాస్తుల ప్రాసెస్ పూర్తవ్వగా 60,213 అప్లికేషన్లను ప్రభుత్వం ఆమోదించింది. 75% దరఖాస్తులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించలేదని వెల్లడించింది. దరఖాస్తుదారులు వివరాలతో సవరణ చేసుకోవచ్చంది. మున్సిపాలిటీలు, నగరాభివృద్ధి సంస్థలు, కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తామంది. దరఖాస్తుదారులు ఏమైనా సందేహాలుంటే అక్కడికి వెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపింది.

Similar News

News January 6, 2026

ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

HYDలోని <>ECIL<<>> 20 టెక్నీషియన్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్+వైవా ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in

News January 6, 2026

ఈ చేప ఖరీదు రూ.28కోట్లు!

image

టోక్యోలోని టొయోసు మార్కెట్‌లో నిర్వహించిన వేలంలో ఒక బ్లూఫిన్ ట్యూనా చేప రికార్డు ధర పలికింది. 243kgs బరువున్న ఈ చేపను సుమారు రూ.28Crకు ($3.2M) ఓ రెస్టారెంట్ యజమాని దక్కించుకున్నారు. జపాన్‌లోని ‘Oma’ తీరంలో దొరికిన ఇలాంటి చేపలు రుచికరంగా ఉంటాయని పేరుంది. అలాగే అక్కడి సంప్రదాయం ప్రకారం న్యూఇయర్ తొలి వేలంలో అత్యధిక ధరకు చేపను కొంటే అదృష్టమని భావిస్తారు. అందుకే వ్యాపారులు ఎంత ఖర్చయినా వెనకాడరు.

News January 6, 2026

బంగ్లాదేశ్ హిందూ క్రికెటర్‌ను కెప్టెన్ చేసింది: జేడీయూ నేత

image

బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్‌ను KKR జట్టు నుంచి <<18748860>>తొలగించడాన్ని<<>> JDU నేత KC త్యాగి తప్పుబట్టారు. ‘క్రీడలను రాజకీయాలు ప్రభావితం చేయకూడదు. బంగ్లాలో జరుగుతున్న వాటిపై మనం ఆందోళన చేస్తున్నాం. IPL నుంచి ఆ దేశ క్రికెటర్‌ను తొలగించాం. కానీ బంగ్లా జాతీయ జట్టుకు మైనారిటీ క్రికెటర్, హిందువు(లిటన్ దాస్‌)ను కెప్టెన్‌గా చేసింది. వాళ్లు బలమైన సందేశం పంపారు. మనం పునరాలోచించాలి’ అని చెప్పారు.