News February 22, 2025
ఈ-శ్రమ్ పోర్టల్లో 81 లక్షల మంది వివరాల నమోదు

APలో 1.80Cr మంది అసంఘటిత కార్మికులు ఉన్నట్లు కార్మిక శాఖ గుర్తించింది. ఇప్పటి వరకు 81.46L మంది వివరాలను <<8091811>>ఈ-శ్రమ్ పోర్టర్లో<<>> నమోదు చేసినట్లు తెలిపింది. వీరిలో 56% మహిళలు, 44% పురుషులు ఉన్నారంది. 18-50ఏళ్ల వ్యక్తులు ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే PM జీవన్ జ్యోతి కింద రూ.2లక్షల బీమా అందుతుంది. 18-70 ఏళ్లవారు రూ.20 చెల్లిస్తే PM సురక్ష బీమా యోజన కింద పలు ప్రయోజనాలు లభిస్తాయి.
Similar News
News February 22, 2025
మళ్లీ థియేటర్లలోకి ‘యుగానికి ఒక్కడు’

తమిళ స్టార్ నటుడు కార్తీ హీరోగా సెల్వరాఘవన్ తెరకెక్కించిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదలవనుంది. 2010 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత మార్చి 14న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, USAలో రీరిలీజ్ అవుతుందని తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.
News February 22, 2025
ఆడిన తొలి ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ వీరులు వీరే

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ సెంచరీతో చెలరేగారు. తానాడిన తొలి ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఆయన శతకం బాదడం విశేషం. ఆయనే కాకుండా మరికొందరు ప్లేయర్లు కూడా తామాడిన తొలి ఛాంపియన్స్ టోర్నీలో సెంచరీ చేశారు. వారిలో అలిస్టర్ క్యాంప్బెల్, సచిన్, సయీద్ అన్వర్, గుణవర్ధనే, కైఫ్, తరంగ, ధవన్, తమీమ్ ఇక్బాల్, విల్ యంగ్, లాథమ్, హృదోయ్, గిల్, రికెల్టన్ ఉన్నారు.
News February 22, 2025
అంజనీకుమార్, అభిలాషలను రిలీవ్ చేసిన TG సర్కార్

కేంద్ర హోంశాఖ ఆదేశాలతో IPS అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్లను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. మరో ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిపై సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ అంశాన్ని ప్రభుత్వం ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈసీ ఆదేశాలను బట్టి రిలీవ్ అంశం ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.