News March 11, 2025
కూటమి MLC అభ్యర్థుల ఆస్తుల వివరాలు

AP: MLA కోటా MLC ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఐదుగురు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కూటమికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనమే. వారి ఆస్తుల వివరాలిలా..
* బీద రవిచంద్ర- రూ.41కోట్లు
* బీటీ నాయుడు- రూ.5.68కోట్లు
* కావలి గ్రీష్మ- రూ.1.78కోట్లు
* సోము వీర్రాజు- రూ.2.81కోట్లు
* నాగబాబు- రూ.70.32కోట్లు
Similar News
News March 12, 2025
అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా?

కొందరికి అర్ధరాత్రి 12 గంటలైనా నిద్ర పట్టదు. కానీ అంతసేపు నిద్రపోకుండా ఉండడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 5 గంటలు ఫోన్ చూసేవారిలోనే ఈ సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు. రాత్రి తక్కువగా తినాలి. నిద్రకు 2 గంటల ముందే భోజనం తీసుకోవాలి. గది ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉంచుకోవాలి. మ్యూజిక్ వినడం, బుక్స్ చదవాలి. నిద్రకు గంట ముందే ఫోన్‌ను దూరంగా పెట్టి పడుకుంటే నాణ్యమైన నిద్ర దొరుకుతుంది.
News March 12, 2025
ఇండియాకు రూ.20.80 కోట్లు.. పాక్‌కి ఎంతంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన భారత జట్టుకు ICC రూ.20.80 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చింది. ఇక రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.10.40 కోట్లు చెల్లించింది. కాగా, సెమీస్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా& సౌతాఫ్రికా జట్లకు రూ.5.20కోట్లు, 5, 6 స్థానాల్లో నిలిచిన అఫ్గాన్ & బంగ్లాదేశ్‌లకు రూ.3 కోట్లు, ఇక చివరి రెండు స్థానాల్లో ఉన్న పాకిస్థాన్ & ఇంగ్లండ్ టీమ్స్‌కు రూ.1.20 కోట్లు అందించింది.
News March 12, 2025
సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలం: KCR

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని, మూడో వంతు సమయం పూర్తైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దళితబంధు నిలిపివేయడం, గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు.