News February 20, 2025
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తుల వివరాలివే

ఢిల్లీ సీఎం <<15518802>>రేఖా గుప్తా<<>> ఎన్నికల సమయంలో తన ఆస్తుల వివరాలను ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. 2023-24FYలో తన సంపాదన ₹6.92 లక్షలు అని, ₹48.44లక్షల రుణాలు ఉన్నట్లు వెల్లడించారు. ₹1.25 కోట్ల విలువైన చరాస్తులు, ₹2.30కోట్ల స్థిరాస్తులు, ₹18 లక్షల విలువైన ఆభరణాలు, రెండు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలిపారు. తనకు సొంత వాహనం లేదని పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.
Similar News
News November 2, 2025
తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థానం

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి వాహన సేవను నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీదేవీ, భూదేవీ సమేతంగా మాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ వాహన సేవ ఉ.6-7.30 గంటల మధ్య జరగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.
News November 2, 2025
శుభ కార్యాలు చేసేటప్పుడు పట్టు వస్త్రాలను ఎందుకు ధరించాలి?

శుభకార్యాలు చేసేటప్పుడు పట్టు వస్త్రాలు ధరించడానికి వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. సృష్టిలో ప్రతి ప్రాణి చుట్టూ ‘ఓరా’ అనే సప్తవర్ణ కాంతి పుంజం ఉంటుందట. పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఇది మరింత శక్తివంతంగా మారుతుందట. పట్టు వస్త్రాలు చుట్టూ ఉన్న ఈ సానుకూల శక్తిని ఆకర్షించి, మన శరీరమంతటా ప్రసరించేలా చేస్తుందట. అందుకే పెళ్లిళ్లు, పూజాది క్రతువులు, దేవాలయ దర్శనాల్లో పట్టు వస్త్రాలు ధరించడం ఆనవాయితీ.
News November 2, 2025
అడుగు దూరంలో ట్రోఫీ.. నేడే ఫైనల్

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఆఖరి మజిలీకి చేరుకుంది. దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడటానికి కొన్ని గంటలే మిగిలున్నాయి. నవీ ముంబయి వేదికగా WC ఫైనల్లో హర్మన్ ప్రీత్ సేన SAతో తలపడనుంది. ఎవరు గెలిచినా వారికి ఇదే తొలి WC అవుతుంది. రెండుసార్లు ట్రోఫీకి అడుగుదూరంలో ఆగిపోయిన భారత మహిళల జట్టు ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో లైవ్ చూడొచ్చు.


