News September 9, 2025

ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవా టికెట్ల రుసుముల వివరాలు

image

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 22 నుంచి దసరా ఉత్సవాలు మొదలుకానున్నాయి. 11 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో ఆర్జిత సేవా టికెట్ల రుసుమును ఆలయ అధికారులు ఖరారు చేశారు. ఖడ్గమాలార్చనకు ₹5,116, ప్రత్యేక కుంకుమార్చనకు ₹3వేలు, మూలా నక్షత్రం రోజున ₹5 వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక శ్రీచక్రనవావరణార్చనకు ₹3 వేలు, ప్రత్యేక చండీహోమంకు ₹4 వేలు, పరోక్ష సేవకు ₹1,500 ఖరారు చేశారు.

Similar News

News January 29, 2026

మేడారం జాతర సిత్రాలు (Photo Gallery)

image

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. సమ్మక్క గద్దెపైకి రావడంతో భక్తుల కోలాహలం మరింత పెరిగింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వనదేవతలకు బంగారం (బెల్లం) సమర్పిస్తున్నారు. మేడారం జనజాతర, విశేషాలను పైన ఫొటో గ్యాలరీలో చూడండి.

News January 29, 2026

పోలీసు సేవకు సలాం చెప్పాల్సిందే!

image

అందరూ కుటుంబంతో మేడారం జాతరకు వెళ్తే పోలీసులు మాత్రం మన కోసం కుటుంబాన్ని వదిలి పహారా కాస్తున్నారు. నేడు సమ్మక్క తల్లి గద్దెపైకి రానున్న తరుణంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఒక్క చిన్న ప్రమాదం, పొరపాటు కూడా జరగకుండా వారు అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో క్రమశిక్షణతో మహాజాతరను శాంతియుతంగా పూర్తి చేసుకుందాం. పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుదాం.

News January 29, 2026

కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయం!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనని మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. ఆయనకు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తదుపరి విచారణ తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్ మరోసారి నోటీసులు ఇస్తుందా? ఎప్పుడు, ఎక్కడ విచారిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. తనను ఎర్రవల్లిలోనే <<18996095>>ప్రశ్నించాలని<<>> కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.