News October 21, 2024
కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలు వెల్లడించాలి: కడియం
TG: గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. దోపిడీని ప్రశ్నించినందుకే తనను పక్కనపెట్టారని అన్నారు. ‘2014లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఎన్ని? కేసీఆర్ నీతిమంతులైతే తమ ఆస్తుల వివరాల్ని వెల్లడించాలి’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదని, ఆ పార్టీల నేతలు అధికారం కోసం పోటీ పడుతున్నారని అన్నారు.
Similar News
News January 3, 2025
ఫిబ్రవరిలో పంచాయతీతో పాటు మున్సిపల్ ఎన్నికలు!
TG: పంచాయతీ ఎలక్షన్లతో పాటు లేదా కొద్దిరోజుల గ్యాప్‌తో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నెల 26తో మున్సిపాలిటీల గడువు ముగియనుండగా సంక్రాంతి తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేసి FEB మొదటివారంలోగా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం వెలువడకపోవడంతో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. మున్సిపాలిటీలకు ఆ సమస్య లేకపోవడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News January 3, 2025
నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు నేటి నుంచి మూడు రోజుల పాటు HYDలోని హైటెక్స్‌లో జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సభలను ప్రారంభించనున్నారు. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క హాజరుకానున్నారు. ఎల్లుండి ముగింపు వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
News January 3, 2025
నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఘటనకు, అల్లు అర్జున్‌కు సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.