News March 18, 2024

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం వివరాలు..

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏడబ్ల్యూఎస్ స్టేషన్‌లో ఉ. 8:30 గంటలకు నమోదైన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో నాగల్ గిద్ద, సత్వార్ 34.5, ముక్తార్ 32.8, కంగ్టి 22.8, మొగుడంపల్లి 10.8, మనూర్ 8.5, సిద్దిపేట జిల్లాలో వెంకట్రావుపేట 5.8, కోహెడ 2.5, గండిపల్లి 2.0, మెదక్ జిల్లాలో కౌడిపల్లి 1.8, రేగోడ్ 1.5, పాతూరు 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Similar News

News July 1, 2024

పటాన్‌చెరు: తల్లి మందలింపు.. బాలుడి అదృశ్యం

image

స్కూల్‌కి వెళ్లమని మందలించినందుకు బాలుడు అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జహీరాబాద్ వాసి స్వరూప భర్తతో గొడవపడి పటాన్‌చెరు మండలం ముత్తంగిలో వేరుగా ఉంటోంది. ముగ్గురు కుమారుల్లో 2వ వాడు ఇమాన్యూయల్(9)ను శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లడానికి సిద్ధంకమ్మని మందలించింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News July 1, 2024

సంగారెడ్డి: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

పద్మ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తూ హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. www.padmaawards. gov.inలో జూలై 31లోగా ఆసక్తి ఉన్న జిల్లాకు చెందిన వారు డీఐవో ఎన్ఐసీ ద్వారా సంబంధిత హెచ్ఐ్వడీలకు నామినేషన్లను సమర్పించాలని సూచించారు.

News July 1, 2024

MDK: పోలీసుల పేరుతో దాడి దోపిడీ

image

మెదక్ జిల్లాలో పోలీసుల పేరుతో పట్టపగలే దారి దోపిడీ జరిగింది. నంగనూరు మండలం పాలమాకులకు చెందిన చిత్తారి శర్మ నర్సాపూర్‌లో బంధువుల ఇంటికి వెళ్తున్నారు. బస్సు దిగి నడిచి వెళ్తుండగా వచ్చిన ఇద్దరు దుండగులు తాము పోలీసులమని చెప్పి అడ్డుకున్నారు. శర్మను ఒకరు పట్టుకోగా మరొకరు మెడలోని బంగారం గొలుసు, ఉంగరం తీసుకొని పారిపోయారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు SI పుష్పరాజ్ తెలిపారు.