News March 9, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతల వివరాలు..

☞ 1998 – సౌతాఫ్రికా
☞ 2000 – న్యూజిలాండ్
☞ 2002 – శ్రీలంక& ఇండియా(వర్షం వల్ల ఫైనల్ రద్దైంది)
☞ 2004 – వెస్టిండీస్
☞ 2006 – ఆస్ట్రేలియా
☞ 2009 – ఆస్ట్రేలియా
☞ 2013 – ఇండియా
☞ 2017 – పాకిస్థాన్
☞ 2025* – లోడింగ్
Similar News
News March 28, 2026
‘చికెన్‌పాక్స్’ జీవితంలో ఒక్కసారే ఎందుకు వస్తుంది?

మనకు జ్వరాలు, ఇన్ఫెక్షన్లు అనేకసార్లు వస్తాయి. కానీ చికెన్‌పాక్స్(ఆటలమ్మ/అమ్మవారు) ఓసారి వస్తే మళ్లీ రాదు. దీనికి కారణాలు తెలుసుకుందాం. వెరిసెల్లా జోస్టర్ వైరస్ వల్ల ఈ అంటువ్యాధి వస్తుంది. తీవ్రమైన దురద, దద్దుర్లు, జ్వరం, అలసట దీని లక్షణాలు. 5-7 రోజులకు తగ్గుతుంది. ఈ వ్యాధి సోకగానే శరీరం ఉత్పత్తి చేసే యాంటీబాడీలు జీవితకాల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మళ్లీ వైరస్ సోకినా వెంటనే అంతం చేస్తాయి.
News March 28, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,48,090కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.3,540 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,35,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,50,000గా ఉంది.
News March 28, 2026
ఆయిల్ పామ్ తోటల్లో పచ్చిరొట్ట ఎరువులతో ప్రయోజనం

పచ్చిరొట్ట ఎరువులు పంటలకు మేలు చేస్తాయి. ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు గల ఆయిల్ పామ్ మొక్కల పాదులలో మూడు అడుగుల దూరములో జనుమువేసి, పూతదశ వరకు పెంచిన తర్వాత దానిని చిన్నచిన్న ముక్కలుగా చేసి పాదులలో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నీటి వృథా అరికట్టటమే కాకుండా నేలలో సేంద్రియ పదార్థాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. దీని వలన కలుపు మొక్కల బెడద తగ్గుతుంది.


