News March 23, 2024

డ్రైఈస్ట్‌లో OPM, కొకైన్, హెరాయిన్ గుర్తింపు

image

AP: విశాఖ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. పోర్టులో పట్టుబడ్డ డ్రైఈస్ట్‌ నుంచి శాంపిల్స్ సేకరించిన CBI డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించింది. ఇందులో ప్రాథమికంగా OPM, కొకైన్, హెరాయిన్ ఉన్నట్లు గుర్తించింది. దీంతో మరింత లోతుగా విచారణ చేస్తోంది. సంధ్యా ఆక్వా, ఐసీసీ బ్రెజిల్ కంపెనీల మధ్య మెయిల్‌లను పరిశీలిస్తోంది. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Similar News

News January 30, 2026

30 ఏళ్లుగా మగాడిలా… ఆ తల్లి ఎందుకలా మారింది?

image

తూత్తుకుడి(TN)కి చెందిన పెచియమ్మాళ్(57) 30 ఏళ్లుగా పురుషుడిగా జీవిస్తోంది. దీని వెనుక కన్నీటి కథ ఉంది. పెళ్లి జరిగిన 15 రోజులకే భర్త చనిపోయాడు. గర్భంతో ఉన్నట్లు తర్వాత తెలిసింది. బిడ్డ కోసం, వేధింపులను తప్పించుకునేందుకు మగాడిగా మారింది. జుట్టు కత్తిరించుకుని, ముత్తుగా ఐడెంటిటీని మార్చుకుంది. ఏళ్లుగా ఎన్నో కష్టాలకోర్చి కూతురిని పెంచింది. ఇటీవల పెళ్లి చేసింది. ఇకపైనా ముత్తుగానే ఉంటానని అంటోంది.

News January 30, 2026

ఫామ్‌హౌస్‌లో కుదరదు.. నందినగర్‌లోనే విచారణ: సిట్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే విచారిస్తామని స్పష్టం చేశారు. అయితే రేపు విచారించాల్సి ఉండగా కేసీఆర్ అభ్యర్థనతో విచారణ తేదీని మార్చారు. ఫిబ్రవరి 1న (ఆదివారం) మ.3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని తాజాగా మరో నోటీసు ఇచ్చారు.

News January 30, 2026

గోల్డ్, సిల్వర్ ఎఫెక్ట్.. మెటల్ స్టాక్స్ ఢమాల్

image

బంగారం, వెండి సహా బేస్ మెటల్స్‌ ధరలు భారీగా తగ్గడంతో ఈరోజు లోహపు షేర్ల విలువలు పడిపోయాయి. హిందూస్థాన్ జింక్ (12%), వేదాంత (11%), NALCO (10%), హిందూస్థాన్ కాపర్ (9.5%), హిందాల్కో (6%), NMDC (4%) స్టాక్స్ వాల్యూస్ కుంగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 5% పతనమైంది. డాలర్ పుంజుకోవటంతో ఓ దశలో గోల్డ్ ధరలు 9%, సిల్వర్ రేట్లు 15% మేర కరెక్ట్ అయ్యాయి.