News November 30, 2024

డిటాక్స్ బార్స్, IV డ్రిప్స్: పెళ్లి వేడుకల్లో కొత్త ట్రెడిషన్

image

పెళ్లి వేడుకల్లో కాక్‌టైల్, లిక్కర్ పార్టీలు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. వివాహ సమయంలో వధూవరులు, బంధువులు హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడకుండా వెడ్డింగ్ ప్లానర్స్ డిటాక్స్ బార్‌లను ఏర్పాటుచేయడం పెరిగింది. ఇందులో ఫ్రెష్ జ్యూసెస్, వెల్‌నెస్ డ్రింక్స్‌తో IV డ్రిప్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కొత్త ట్రెడిషన్‌ ప్లాన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అతిథులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడానికి ఉపయోగపడుతోంది.

Similar News

News March 8, 2026

రక్త పరీక్షలు.. ఎందుకు చేయించుకోవాలి?

image

* CBC(కంప్లీట్ బ్లడ్ కౌంట్): ఎర్ర, తెల్ల రక్త కణాల సంఖ్య, హిమోగ్లోబిన్, అనీమియా, లుకేమియా, ఇన్ఫెక్షన్ల గుర్తింపు
* లిపిడ్ ప్రొఫైల్: కొలెస్ట్రాల్& గుండె వ్యాధుల రిస్క్‌
* బ్లడ్ షుగర్(ఫాస్టింగ్&HbA1c): డయాబెటిస్ అంచనా
* థైరాయిడ్ ప్రొఫైల్(TSH, T3, T4): హార్మోనల్ సమస్యలు
* LFT, KFT: లివర్, కిడ్నీ హెల్త్ చెక్
* విటమిన్ D&B12: ఎనర్జీ, ఇమ్యూనిటీ, బోన్స్ హెల్త్
* CRP/ESR: ఇన్ఫెక్షన్ల గుర్తింపు
#ShareIt

News March 8, 2026

టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఒక్క రోజే ఛాన్స్!

image

రైల్వేలో 22,195 గ్రూప్‌-D ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 9 రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పాయింట్స్‌మన్, ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో 1,012 పోస్టులున్నాయి. రైల్వే అధికారిక <>వెబ్‌సైట్‌<<>>లో అప్లై చేసుకోవచ్చు.

News March 8, 2026

అన్నింటా నువ్వే.. వందనాలమ్మా!

image

ఆమె.. మల్టీ టాస్కింగ్ చేయగల నేర్పరి. తల్లిగా, భార్యగా, కోడలిగా ఏకకాలంలో బాధ్యతలు నెరవేర్చగల ఎక్స్‌పర్ట్. ఇంట్లో జీతం తీసుకోని, రిటైర్మెంట్ లేని ఉద్యోగి. కుటుంబాన్ని నడిపించే ఆర్థికవేత్త. ఓపిక ఆమె బలం.. సహనం ఆమె ఆభరణం.. ప్రేమ పంచడంలో దైవం. అవకాశాల్ని అందిపుచ్చుకుని, అడ్డంకులను దాటుకుని, తమను తాము నిరూపించుకుని ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళకు వందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.